ఉత్తర సిక్కిం శిఖరాలపై చిక్కుకుపోయిన చైనీయులు, రక్షించిన భారత దళాలు

ఉత్తర సిక్కింలోని కొండ శిఖరాలపై చిక్కుకుపోయిన ముగ్గురు చైనీయులను భారత దళాలు రక్షించాయి. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున శిఖరంపై దారి తప్పి, ఎముకలు కొరికివేస్తున్న చలిలో గజగజవణికిపోతూ తమను రక్షించేవారికోసం ఎదురు తెన్నులు చూస్తున్న వీరిని జవాన్లు అతి కష్టం మీద కాపాడారు. ఈ చైనీయుల్లో ఇద్దరు పురుషులు కాగా ఓ మహిళ కూడా ఉంది. వీరికి జవాన్లు వెంటనే ఆక్సిజన్, ఇతర సహాయం చేశారు. ఆహారం, కొన్ని స్వీట్లు అందజేసి, వారి ప్రయాణానికి […]

ఉత్తర సిక్కిం శిఖరాలపై చిక్కుకుపోయిన చైనీయులు, రక్షించిన భారత దళాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 05, 2020 | 4:10 PM

ఉత్తర సిక్కింలోని కొండ శిఖరాలపై చిక్కుకుపోయిన ముగ్గురు చైనీయులను భారత దళాలు రక్షించాయి. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున శిఖరంపై దారి తప్పి, ఎముకలు కొరికివేస్తున్న చలిలో గజగజవణికిపోతూ తమను రక్షించేవారికోసం ఎదురు తెన్నులు చూస్తున్న వీరిని జవాన్లు అతి కష్టం మీద కాపాడారు. ఈ చైనీయుల్లో ఇద్దరు పురుషులు కాగా ఓ మహిళ కూడా ఉంది. వీరికి జవాన్లు వెంటనే ఆక్సిజన్, ఇతర సహాయం చేశారు. ఆహారం, కొన్ని స్వీట్లు అందజేసి, వారి ప్రయాణానికి అవసరమైన కారును కూడా సమకూర్చారు. దాదాపు మరణం అంచులవరకు వెళ్లిన తమకు ప్రాణదానం చేసిన భారత జవాన్లకు ఈ ముగ్గురు చైనీయులు కృతజ్ఞతలు తెలిపారు.

ఓ వైపు లడఖ్ లో చైనా దళాలు చొరబడి భారత సైనికులను కవ్విస్తూ, భారత భూభాగంలోకి చొరబడుతుంటే మరో వైపు ఈ ముగ్గురు చైనీయుల పట్ల మన జవాన్లు చూపిన మానవతా దృక్పథాన్ని అంతా హర్షిస్తున్నారు.