
పహల్గామ్ దాడి తర్వాత , పాకిస్తాన్‌తో ఉద్రిక్తత మధ్య భారత సైన్యం బలం మరింత పెరిగింది. దీని వెనుక కారణం రష్యా నుండి వచ్చిన ఆయుధం. ఇది శత్రు సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలను గాల్లోనే నాశనం చేస్తుంది. ఇగ్లా-ఎస్ క్షిపణిని రష్యా నుండి భారత సైన్యానికి అందించారు.
పాక్‌పై సైనిక చర్య తప్పదా.. ఇందుకు సన్నాహాలు జరుగుతున్నాయా అంటే తాజా పరిణామాల్ని విశ్లేషిస్తున్న రక్షణరంగ నిపుణులు ఔననే అంటున్నారు. యుద్ధం తప్పకపోతే అందుకు పూర్తిగా సిద్ధమైంది భారత్. త్రివిధ దళాల వరుస విన్యాసాలతో పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. అలాగే మే 9న రష్యాలో విక్టరీ పరేడ్‌కి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు, సైనిక బలగాలు హాజరవుతున్నాయి. ఆ ఈవెంట్‌కి వెళ్లాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఒకవైపు పాకిస్తాన్ సైన్యం ఆయుధాలు కరువై అల్లాడుతుంటే, మరోవైపు భారత్ మాత్రం ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈక్రమంలోనే యుద్ధ విమానాలు, చాపర్లు, డ్రోన్లను కూల్చే షార్ట్ రేంజ్ వెపన్స్‌ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది భారత్. ఈ క్రమంలోనే రష్యా నుండి ఇగ్లా-ఎస్ క్షిపణి భారత సైన్యానికి అందింది. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలను సరిహద్దు ప్రాంతాలలో వేగవంతమైన, ఖచ్చితమైన వైమానిక రక్షణ కోసం ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. ఇగ్లా-ఎస్ అనేది ఒక MANPADS అంటే మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీనిని సైనికులు తమ భుజాలపై ఉంచుకుని కాల్చవచ్చు. ఇది ఆకాశంలో స్వల్ప-శ్రేణి లక్ష్యాలను కూల్చి వేసేందుకు ఉపయోగించడం జరుగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా, భారతదేశ సాయుధ దళాలు (సైన్యం, వైమానిక దళం) రష్యాకు చెందిన ఈ ఇగ్లా క్షిపణిని ఉపయోగిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇవి చాలా పాతవి అయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక అయుధాన్ని భారత్‌కు సమకూర్చుతోంది రష్యా.
కొత్త వాయు రక్షణ వ్యవస్థ పరిధి 6 కి.మీ.
ఇగ్లా పరిధి 3-4 కిలోమీటర్లు కానీ కొత్త ఇగ్లా-ఎస్ పరిధి ఆరు (6) కిలోమీటర్లు. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలో చివరి క్షిపణి. ఇది శత్రు డ్రోన్లు, ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్లు, క్షిపణులను కూల్చివేయగలదు. దాని దాడి తప్పిపోతే శత్రువు దాడి ఖాయం అని భావించవచ్చు. అందుకే దీనిని ఒక ముఖ్యమైన వాయు రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు. రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్‌పోర్ట్ కంపెనీ ఇప్పుడు ఈ క్షిపణి వ్యవస్థను భారతదేశంలోనే ఒక భారతీయ కంపెనీతో కలిసి తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
పశ్చిమ – ఉత్తర సరిహద్దుల్లో పెరిగిన బలం
భారతదేశ భద్రతా అవసరాలు వేగంగా మారుతున్న తరుణంలో, డ్రోన్ దాడులు, సరిహద్దు వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి సంసిద్ధత అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇగ్లా-ఎస్ మోహరింపుతో, భారత సైన్యం ఇప్పుడు వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పొందింది. పరిమిత వనరులు ఉన్నప్పటికీ ప్రధాన ముప్పులను నివారించే వ్యూహాలు సాధ్యమయ్యాయి. ఇది డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటే లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అమలు చేయడంలో సహాయపడుతుంది. ఈ క్షిపణి వ్యవస్థను మోహరించడం వల్ల పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుపై సైనిక ఒత్తిడి మరింత బలపడింది. ఇది కాకుండా, చైనా డ్రోన్, నిఘా కార్యకలాపాలకు ప్రతిస్పందనగా ఇది ఒక వ్యూహాత్మక అడుగు కూడా.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..