మూగజీవిపై అక్కసు.. సజీవంగా పూడ్చేసిన వైనం

|

Sep 08, 2019 | 1:04 AM

నోరులేని జీవులు మనుషులు కంటే స్వచ్ఛంగా ఉంటాయి. మనం వాటికి ఏదైనా హానీ తలపెడితే తప్ప.. అవి మన మీద దాడి చేయవు. పిల్లుల దగ్గర నుంచి పులుల వరకు ఏ జంతువైనా.. కావాలని మనుషులపై దాడికి దిగవు. కానీ మనుషులే వాటి మీద రీజన్ లేకుండా దాడి చేస్తుంటారు. మనుషుల మాదిరిగానే వాటికి కూడా సంతోషం, బాధ, నొప్పి, భయం ఇలా అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. మన కుటుంబంపైకి ఎవరైనా దాడికి వస్తే ఎలా […]

మూగజీవిపై అక్కసు.. సజీవంగా పూడ్చేసిన వైనం
Follow us on

నోరులేని జీవులు మనుషులు కంటే స్వచ్ఛంగా ఉంటాయి. మనం వాటికి ఏదైనా హానీ తలపెడితే తప్ప.. అవి మన మీద దాడి చేయవు. పిల్లుల దగ్గర నుంచి పులుల వరకు ఏ జంతువైనా.. కావాలని మనుషులపై దాడికి దిగవు. కానీ మనుషులే వాటి మీద రీజన్ లేకుండా దాడి చేస్తుంటారు. మనుషుల మాదిరిగానే వాటికి కూడా సంతోషం, బాధ, నొప్పి, భయం ఇలా అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. మన కుటుంబంపైకి ఎవరైనా దాడికి వస్తే ఎలా రియాక్ట్ అవుతామో.. సరిగ్గా మూగ జీవులు కూడా అలానే స్పందిస్తాయి. కొంత ప్రేమను చూపిస్తే చాలు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అలాంటి ఈ నోరులేని జీవులపై బీహార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తమ రాక్షసత్వం చూపించింది.

బ్రతికుండగానే మనుబోతులు అనే జింకల జాతికి చెందిన ఓ అంటిలోప్‌ను కాల్చి సజీవంగా పూడ్చేశారు. ఈ ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. జంతు హత్య మహాపాపం అంటారు. అలాగే ఏ తప్పు చేయని ఓ జింకను సజీవంగా పూడ్చి పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు బీహార్ ఫారెస్ట్ అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే వైశాలి జిల్లాలోని భగవాన్‌పుర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగష్టు 30వ తేదీ నుంచి ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. గుంతలోకి గాయపడిన జింకను తోసి.. సజీవంగా పూడ్చిపెట్టిన జేసీబీ డ్రైవర్‌పై ఎఫ్.ఐ.ఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ కేసు రీత్యా ఎలాంటి అరెస్టులు జరగలేదని సమాచారం. భగవాన్‌పుర్‌ పరిధిలోని పంట పొలాలను సుమారు 300ల జింకలు వచ్చి నాశనం చేస్తున్నాయని అక్కడి ప్రజలు గగ్గోలు పెట్టడంతో.. ఆ ఊరి అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతులు కలిపి షార్ప్ షూటర్ల సహాయంతో వాటిని అంతమొందించారు. అందులో ఒక్క జింక గాయంతో బయటపడగా.. దానిపై వీరు తమ రాక్షసత్వం చూపించి బ్రతికుండగానే గుంతలోకి తోసి సజీవంగా పూడ్చి పెట్టారు.

పంటలను నాశనం చేయడం తప్పే.. అలా అని 300ల జింకలను చంపేస్తారా.? వాటిని చూసుకోవడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. లేకపోతే వేరే మార్గంలో సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. అంతేగానీ నోరులేని జీవాలను విచక్షణ కోల్పోయి చంపేయడం ఘోరమని నెటిజన్లు వాపోతున్నారు.

ఇక ఈ రాక్షస చర్యపై బీ టౌన్ సెలెబ్రిటీలు కూడా తమ గళం విప్పారు. నటి పూజా భట్.. పెటా ఇండియా ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘జేసీబీ డ్రైవర్‌కు కఠినమైన శిక్ష వెయ్యాలని.. దయాదాక్షిణ్యాలు లేకుండా మూగజీవిపై ఇలాంటి చర్యకు పాల్పడిన అతడు.. భవిష్యత్తులో తన పిల్లలపై కూడా చేయవచ్చని.. పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మరో నటి ఈషా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. క్రూరంగా బ్రతికుండగానే నోరులేని జీవులను పూడ్చిపెట్టడం సరైన చర్య కాదు. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు చాలామంది నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా వైశాలి ఎస్పీ మానవజోత్ సింగ్ దిల్లోన్.. ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.