
స్వాతంత్ర్య దినోత్సవం మధ్య దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ ఏరియాలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. దర్గా పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది మరణించారు. మృతుల్లో 3 మంది మహిళలు మరియు 2 మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. 12 మందికి గాయాలయ్యాయి. మరో 11 మందిని సురక్షితంగా బయటపడ్డారు. గాయాలైన వారిని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమాయున్ సమాధి వెనుక ఉన్న పట్టేషా దర్గా 2 గదులు కూలిపోయాయి. NDRF, అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.
ఢిల్లీలో కొద్దిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. హుమాయూన్ సమాధి ప్రాంగణంలోని దర్గా పైకప్పు కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నిజాముద్దీన్ ఏరియాతోపాటు.. చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
#WATCH | Delhi | NDRF personnel conduct a search operation at Dargah Sharif Patte Shah, located near Humayun’s Tomb, in the Nizamuddin area, following the collapse of the roof of a room in the dargah premises.
Police and Fire Department personnel are also present.
So far, 11… pic.twitter.com/6oW3XjroAX
— ANI (@ANI) August 15, 2025
#WATCH | Delhi | Portion of the roof of a room at Dargah Sharif Patte Shah, located in the Nizamuddin area, collapses; Police and Fire Department personnel on the spot; Area cordoned off pic.twitter.com/dMAEcJrlQn
— ANI (@ANI) August 15, 2025
ఇక.. మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ మరణాంతరం అతని భార్య హుమీదా బాను బేగం ఆదేశానుసారం 1562లో సమాధి నిర్మాణాన్ని చేపట్టారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 16వ శతాబ్దానికి చెందిన హుమాయూన్ సమాధి ఢిల్లీలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. దీనిని సందర్శించేందుకు ప్రతిరోజూ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే.. స్వాతంత్ర్య దినోత్సవం కావడం.. సందర్శకుల రద్దీ పెరిగే వేళ హుమాయూన్ దర్గా పైకప్పు కూలడం కలకలం రేపింది.
మరింత సమాచారం అందాల్సి ఉంది.