హిజ్ బుల్ ముజాహిదీన్ ఫౌండర్ సయ్యద్ సలాఉద్దీన్ కొడుకులు ‘స్యుడో టెర్రరిస్టులే’ ! ప్రభుత్వ వర్గాలు

| Edited By: Anil kumar poka

Jul 14, 2021 | 10:59 AM

ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాఉద్దీన్ కొడుకులు..సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్..ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూనే..మరోవైపు టెర్రరిస్టు సంస్థలకు నిధులు అందజేసేవారని, అలాగే ఆ సంస్థల నుంచి కూడా వీరికి సొమ్ము అందేదని

హిజ్ బుల్ ముజాహిదీన్ ఫౌండర్ సయ్యద్ సలాఉద్దీన్ కొడుకులు స్యుడో టెర్రరిస్టులే ! ప్రభుత్వ వర్గాలు
Hizbul Mujahideen Founder Syed Salaudden Founder Photo
Follow us on

ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాఉద్దీన్ కొడుకులు..సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్..ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూనే..మరోవైపు టెర్రరిస్టు సంస్థలకు నిధులు అందజేసేవారని, అలాగే ఆ సంస్థల నుంచి కూడా వీరికి సొమ్ము అందేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఇదివరకటి ప్రభుత్వాలు వీరి నిర్వాకాలు బయటపడకుండా కప్పిపుచ్చాయని ఈవర్గాలు వెల్లడించాయి. 11 మందతో బాటు వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఇటీవలే తొలగించారు. మరో 9 మందితో కలిసి వీరిద్దరూ రహస్యంగా ఉగ్రవాద సంస్థలకు నిధులు పంపేవారు.. హవాలా మార్గాల ద్వారా వీరికి సొమ్ము అందేది అని అధికారులు తమ దర్యాప్తులో తేలిన విషయాలను పేర్కొన్నారు. (సయ్యద్ సలావుద్దీన్ ని అమెరికా గ్లోబల్ టెర్రరిస్టుగాప్రకటించింది). 1999-2000 సంవత్సరంలో షాహిద్ యూసుఫ్ తన తండ్రి పేరును తప్పుగా చూపి దుబాయ్ ని విజిట్ చేశాడని, ఒకసారి తన తండ్రిని కూడా కలిశాడని అధికారులు చెప్పారు.

అయితే అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వీరిని తొలగించడాన్ని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఇది కక్షపూరిత చర్య అని పేర్కొన్నారు. తాను ఎవరీనీ సపోర్ట్ చేయడం లేదని, కానీ ఆధారాలు లేనిదే వీరిపై మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం సబబు కాదని ఆమె అన్నారు. తండ్రి చేసే చర్యలకు పిల్లలను బాధ్యులను చేయరాదన్నారు. అసలు ఈ 11 మందినే కాదు.. ఈ ఏడాది మరో 20 నుంచి 25 మందిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించారు అని ఆమె ప్రభుత్వంపై ఆరోపించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : మరింత ముందుగానే థర్డ్ వేవ్..?మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. :Corona 3rd Wave Live Video.

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మెగాస్టార్..Megastar Chiranjeevi Video.

 Samsung Galaxy Video: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్‌..(వీడియో).

 థర్డ్ వేవ్ షురూ.. మహారాష్ట్ర లో మళ్ళీ పుంజుకుంటున్న కోవిడ్ కేసులు..:Third Wave Of Corona Video.