వర్షాలు, వరదలతో తడిసి ముద్దయిన ముంబై, రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్

భారీ వర్షాలు, వరదలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తుండగా, పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంల్ని 20 మిలియన్ల ప్రజల రాకపోకలకు ఆధారమైన మెట్రో రైళ్లను నిలిపివేశారు. అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయా లనన్నింటినీ మంగళవారం మూసివేశారు. ముంబైతో బాటు సమీప జిల్లాల్లో రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. బుధవారం కూడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్ఛరించింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి […]

వర్షాలు, వరదలతో తడిసి ముద్దయిన ముంబై, రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్

భారీ వర్షాలు, వరదలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తుండగా, పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంల్ని 20 మిలియన్ల ప్రజల రాకపోకలకు ఆధారమైన మెట్రో రైళ్లను నిలిపివేశారు. అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయా లనన్నింటినీ మంగళవారం మూసివేశారు. ముంబైతో బాటు సమీప జిల్లాల్లో రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. బుధవారం కూడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్ఛరించింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు ఒక్క ముంబై సిటీలోనే 203.o 6.మీ.మీ.వర్షపాతం నమోదైంది. రోడ్లపై మోకాలి లోతున నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు  పడ్డారు.

సాధారణంగా ప్రతి ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో రుతుపవనాల జోరు కారణంగా ముఖ్యంగా ముంబై భారీ ఇలా భారీ వర్షాలతో తల్లడిల్లుతుంటుంది. వర్షాలకు తోడు వరదలు కూడా ఈ నగరాన్ని ముంచెత్తడం సహజంగా మారింది.

 

Click on your DTH Provider to Add TV9 Telugu