Viral Video: అమ్మో లేడీ కాదు పెద్ద కిలాడీ.. డ్రగ్స్ ఎక్కడ పెట్టుకొచ్చిందో తెలుసా?.. షాకింగ్ వీడియో..

|

Sep 14, 2022 | 6:37 AM

Viral Video: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు,

Viral Video: అమ్మో లేడీ కాదు పెద్ద కిలాడీ.. డ్రగ్స్ ఎక్కడ పెట్టుకొచ్చిందో తెలుసా?.. షాకింగ్ వీడియో..
Drugs
Follow us on

Viral Video: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా ప్రత్యేకం. తమ పెళ్లి వేడుకకు హాజరవ్వాల్సిందిగా బంధుమిత్రులను ఆహ్వానిస్తూ పెళ్లి చేసుకునే జంట, కుటుంబ సభ్యులు పెళ్లి పత్రికను పంపిస్తుంటారు. వివాహ పత్రిక అనగానే ఎవరైనా సరే ముందుగా కంగ్రాట్స్ చెబుతారు. ఎందుకంటే.. జీవితంలో ఎంతో కీలక మలుపు వివాహం. అంత మంచి శుభకార్యం జరుగబోతోంది కాబట్టే ముందుగా అభినందనలు తెలుపుతారు. ఆహ్వాన పత్రికను సంతోషంగా స్వీకరిస్తారు. అయితే, తాజాగా ఓ పెళ్లి కార్డుకు సంబంధించి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లి ఆహ్వాన పత్రికను అసాంఘీక కార్యక్రమాలకు వినియోగిస్తూ ఓ అమ్మాయి అడ్డంగా బుక్కైంది. అది గమనించిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అవును.. ఓ అమ్మాయి వెడ్డింగ్ కార్డులో దాచి డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తోంది. ఎయిర్ పోర్ట్‌లో అధికారుల తనిఖీలో ఈ బాగోతం బయటపడింది. అది చూసి అధికారులే షాక్ అయ్యారు. ఎయిర్‌పోర్టులో ఓ అమ్మాయి నడవడిక అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. అంతా చెక్ చేసినా ఏమీ లభించలేదు. చివరకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులను పరిశీలించారు. వాటిని ఓపెన్ చేయగా లోపల అంతా డ్రగ్స్ ఉంది. అది చూసి అధికారులు కంగుతిన్నారు. ఆ వెడ్డింగ్ కార్డును స్వాధీనం చేసుకుని, యువతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వీడియోను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ ఉన్న పెళ్లి కార్డుతో ఒక అమ్మాయి పట్టుబడింది’ అనే క్యాప్షన్ పెట్టారు. అలాగే, విమానాశ్రయంలో ఎవరి నుండి ఏమీ తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించారు.

ఇదిలాఉంటే.. వాస్తవానికి ఈ వీడియో దాదాపు రెండేళ్ల క్రితం నాటిది. అయితే, ప్రస్తుత కాలంలో ఎయిర్‌పోర్టుల ద్వారా స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాటి వీడియోను ఐపీఎస్ అధికారి ఇప్పుడు షేర్ చేశారు. ప్రయాణికుల్లో అవగాహన కల్పించడం కోసం ఆయన ఇలా షేర్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..