ఢిల్లీలో భవనం కూలి నలుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. సీసీ టీవీలో భయానక దృశ్యాలు..

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఉరుములతో కూడిన కుండపోత వాన కురిసింది.. ఈ క్రమంలో తెల్లవారుజామున ఓ భవనం కూలి నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. నాలుగు అంతస్థుల భవనం కూలి నలుగురు మరణించిన ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఢిల్లీలో భవనం కూలి నలుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. సీసీ టీవీలో భయానక దృశ్యాలు..
Building Collapses In Delhi

Updated on: Apr 19, 2025 | 9:22 AM

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఉరుములతో కూడిన కుండపోత వాన కురిసింది.. ఈ క్రమంలో తెల్లవారుజామున ఓ భవనం కూలి నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. నాలుగు అంతస్థుల భవనం కూలి నలుగురు మరణించిన ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. తెల్లవారుజాము 3గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. అక్కడికి చేరుకుని రెస్క్యూను ప్రారంభించాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. ఇప్పటివరకు 14 మందిని రక్షించారు.. శిథిలాల కింద మరో 10మంది చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారు.

భవనం ఎలా కూలిందనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందలేదు. ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటలకు జరిగిందని నార్త్ ఈస్ట్ జిల్లా అదనపు డీసీపీ సందీప్ లాంబా తెలిపారు. 14 మందిని రక్షించారని.. నలుగురు మరణించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇంకా 8-10 మంది చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారని.. తెలిపారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ.. ఉదయం ఇల్లు కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని .. వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ప్రారంభించామన్నారు.

మధు విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us