మంత్రి, మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌కి కరోనా

ఉత్తరప్రదేశ్‌ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కి కరోనా సోకింది. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.

మంత్రి, మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌కి కరోనా

Updated on: Jul 12, 2020 | 2:40 PM

ఉత్తరప్రదేశ్‌ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కి కరోనా సోకింది. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను సంజయ్‌ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయగా.. వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా ఆయన త్వరగా కోలుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్లు ఆకాశ్ చెప్రా, ఆర్పీ సింగ్‌ తదితరులు ట్వీట్ చేశారు. కాగా టీమిండియా తరఫున పలు టెస్ట్‌లు, వన్డేల్లో క్రికెట్ ఆడిన చేతన్ చౌహాన్‌.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us