ఢిల్లీ విమానంలో అరుదైన ఘటన.. ఊపిరి ఆగిపోయిన చిన్నారిని కాపాడిన హైదరాబాద్ డాక్టర్..

విమానంలో ఓ పాపకు చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరి తీసుకోవడం ఆగిపోయి, శరీరం నీలం రంగులోకి మారిన రెండు నెలల చిన్నారికి

ఢిల్లీ విమానంలో అరుదైన ఘటన.. ఊపిరి ఆగిపోయిన చిన్నారిని కాపాడిన హైదరాబాద్ డాక్టర్..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 5:32 PM

విమానంలో ఓ పాపకు చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరి తీసుకోవడం ఆగిపోయి, శరీరం నీలం రంగులోకి మారిన రెండు నెలల చిన్నారికి ప్రణామ్ హస్పిటల్ డాక్టర్ వైద్యం చేసారు. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి విమానం ఆకాశంలోకి ఎగిరింది. ఇంతలో అందులో ఉన్న ఓ మహిళ తన పాపను పట్టుకొని ఏడుస్తూ ఉంది. అందుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన విమాన సిబ్బందికి.. తన పాప శ్వాస తీసుకోవడంలేదని, ఆమె శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయిందని చెప్పింది. వెంటనే ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని విమాన సిబ్బంది మైకులో అడగ్గా.. డాక్టర్ మనీష్ ఆ మహిళ వద్దకు వెళ్ళాడు. అనంతరం ఆమె చేతిలోని పాపను తీసుకొని వైద్యం అందించాడు. తర్వాత 5 నిమిషాలకు ఆ పాప శ్వాస తీసుకోవడం ప్రారంభించింది.. అంతేకాకుండా తన శరీరం కూడా తిరిగి మాములు స్థితికి చేరుకుంది. డాక్టర్ మనీష్ ముందే చిన్న పిల్లల డాక్టర్ కావడంతో ఆ చిన్నారికి కావాల్సిన చికిత్సను అందించాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడి ప్రయాణికుల్లో ఒకరు సోషల్ మీడియాలో తన స్నేహితులతో పంచుకోగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం గురించి డాక్టర్ మనీష్ మాట్లాడుతూ.. “విమానంలో రెండు నెలల చిన్నారికి ప్రాణాపాయం తలెత్తడం, ఆ పాపను నేను కాపాడడం మరచిపోలేని అనుభవం. చికిత్సకు ఆ పాప స్పందించింది. తర్వాత ఆ చిన్నారిని హైదరాబాద్ చేరే వరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. చిన్నారి నెలలు నిండకముందే పుట్టడంతో బరువు చాలా తక్కువగా ఉంది. విమానం పైకి ఎగిరే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఆ చిన్నారిని ఎందుకు హైదరాబాద్ తీసుకువస్తున్నారని నేను ఆ పాప తల్లిదండ్రులను అడిగాను. పాపకు కంటి సమస్య ఉందని అందుకోసం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు చెప్పారు” అని మనీష్ తెలిపాడు.

Latest Articles
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? ఈ ఫారమ్‌ పూరించడం తప్పనిసరి
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? ఈ ఫారమ్‌ పూరించడం తప్పనిసరి
బాల్కనీపై చిన్నారి వీడియో.. 'ట్రోల్స్'​ తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
బాల్కనీపై చిన్నారి వీడియో.. 'ట్రోల్స్'​ తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
ఫొటోగ్రాఫర్ల గురించి అసలు విషయం బయట పెట్టిన జాన్వీ కపూర్
ఫొటోగ్రాఫర్ల గురించి అసలు విషయం బయట పెట్టిన జాన్వీ కపూర్
కోల్‌‘కత' మార్చాల్సిందే.. KKR vs SRHగత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
కోల్‌‘కత' మార్చాల్సిందే.. KKR vs SRHగత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
గెలిస్తే ఓ లెక్క.. ఓడితే మరోలెక్క.. నివురుగప్పిన నిప్పులా ఏపీ.!
గెలిస్తే ఓ లెక్క.. ఓడితే మరోలెక్క.. నివురుగప్పిన నిప్పులా ఏపీ.!
మన్యంలో మోగుతున్న డేంజర్ బెల్స్.. పట్టించుకోని అధికారులు..
మన్యంలో మోగుతున్న డేంజర్ బెల్స్.. పట్టించుకోని అధికారులు..
ఏఐ ఎంట్రీతో ఆ జాబ్స్ అన్నీ హుష్‌కాకి.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ఏఐ ఎంట్రీతో ఆ జాబ్స్ అన్నీ హుష్‌కాకి.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
డీకే బాటలోనే!క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో టీమిండియా ప్లేయర్
డీకే బాటలోనే!క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో టీమిండియా ప్లేయర్
రోహిణి కార్తె ప్రారంభం ఈ మొక్కలు నాటండి.. శివయ్య అనుగ్రహం మీ సొంత
రోహిణి కార్తె ప్రారంభం ఈ మొక్కలు నాటండి.. శివయ్య అనుగ్రహం మీ సొంత
ఆ నిబంధనలను పట్టించుకోని ఆసుపత్రులు.. అధికారుల కఠిన చర్యలు
ఆ నిబంధనలను పట్టించుకోని ఆసుపత్రులు.. అధికారుల కఠిన చర్యలు