25 May 2024
TV9 Telugu
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా Moto G04S పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.
ఈ నెల 30న ఈ ఫోన్ విడుదల కానుంది. మోటరోలా ఇప్పటికే విడుదల చేసిన ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్ విడుదల.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో HD+ LCD ప్యానెల్ ఉంటుంది. ఇందులో గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫోన్ 4GB RAMతో పాటు Unisock T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 GB RAM ఉంది, దీనిని 8 GB వరకు విస్తరించవచ్చు. 64 GB ఇంటర్నల్ మెమరీ ఉండనుంది.
Moto G04S స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మోస్ ఆడియో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌లతో కూడిన AI పవర్డ్ బ్యాక్ కెమెరా ఉంది. LED ఫ్లాష్. ఈ ఫోన్‌లో నైట్ విజన్, పోర్ట్రెయిట్ మోడ్ సపోర్ట్.
నలుపు, నీలం, ఆకుపచ్చ, ఆరెంజ్ రంగులలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీతో రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,700. ఉంటుంది. ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సందర్భంగా పలు ఇ-కామర్స్ కంపెనీలు పలు రకాల తగ్గింపులను ప్రకటించాయి.