ప్యాన్ ఇండియా కోసం ఓ వెర్షన్‌ని, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ఇంకో వెర్షన్‌ని రెడీ చేస్తున్నారా? అసలు యష్ మనసులో ఏముంది? కమాన్ లెట్స్ వాచ్...
కేజీయఫ్ సినిమాకి ముందు కన్నడ రాకింగ్ స్టార్ యష్ లైఫ్ ఎలా ఉండేదో గుర్తయినా ఉండదేమో ఆయన అభిమానగణానికి.
కొన్నేళ్ల నుంచి సేమ్ లుక్‌లో చూసీ చూసీ అలవాటు పడిపోయారు. కేజీయఫ్ విషయంలోనే కాదు, నెక్స్ట్ కూడా సేమ్ లుక్‌ని కాస్త అటూ ఇటూ మార్చి కనిపిస్తారు యష్.
లుక్ ఎలా ఉన్నా, మీరు మొనాటనీ ఫీల్ కాకుండా నేను చూసుకుంటాను కదా అని అభిమానులతో అంటున్నారు రాకీ భాయ్.
అందులో భాగంగానే టాక్సిక్ విషయంలో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఫోర్త్ కమింగ్ ఫిల్మ్ టాక్సిక్‌ని రెండు వెర్షన్లలో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది.
ఇండియన్ వెర్షన్, ఇంటర్నేషనల్ వెర్షన్ అనేది ఇప్పుడు అందరినీ ఊరిస్తున్న విషయం. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగం జరుగుతుంది.
త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న మిగిలిన ప్యాన్ ఇండియన్ సినిమాలు టాక్సిక్ పార్ములాని ఇంప్లిమెంట్ చేస్తాయా? అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ అయింది.
అదే జరిగితే ఇంటర్నేషనల్ కట్ లో మా సూపర్‌స్టార్ మహేష్ ఎలా ఉండబోతున్నారో అంటూ ముందే ఊహించుకుని సంబరపడుతున్నారు ఘట్టమనేని అభిమానులు.