COVID-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే బహుమతిగా ముక్కు పుడక, హ్యాండ్ బ్లెండర్.. ఈ ఆఫర్ ఎక్కడంటే..

|

Apr 04, 2021 | 7:40 AM

COVID-19 Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా..

COVID-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే బహుమతిగా ముక్కు పుడక, హ్యాండ్ బ్లెండర్.. ఈ ఆఫర్ ఎక్కడంటే..
Covid Vaccination
Follow us on

COVID-19 Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అందరినీ కలవరానికి గురి చేస్తుంది. మరోవైపు కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు టీకా ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. అయితే, ప్రజల్లో మాత్రం టీకాపై ఇంకా ఆందోళనలు నెలకొన్నాయి. టీకా వేసుకుంటే ప్రాణాపాయం అనే భావనలోనే ఉన్నారు జనాలు. దాంతో టీకా వేసుకునే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితాలు కనిపిస్తున్నట్లు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లో ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు స్వర్ణకారుల సంఘం వినూత్న ప్రయత్నం చేసింది. గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన స్వర్ణకారుల సంఘం.. టీకా వేసుకున్న వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ప్రకటించింది. ప్రకటించడమే కాదు.. ప్రదానం కూడా చేస్తోంది. కరోనా టీకా వేసుకున్న మహిళలకు ఏకంగా బంగారంతో చేసిన ముక్కుపుడకలను బహుకరిస్తోంది. అదే సమయంలో పురుషులకు హ్యాండ్ బ్లెండర్లు, ఇతర వంటింటి సామాగ్రిని అందజేస్తోంది. రాజ్‌కోట్‌లోని టీకా కేంద్రంలో స్వర్ణకారుల సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లో టీకా వేసుకున్న లబ్ధిదారులకు.. ఆ సెంటర్‌లోనే మహిళలు అయితే ముక్కు పుడక, పురుషులు అయితే హ్యాండ్ బ్లెండర్‌ను బహమతిగా ప్రదానం చేస్తున్నారు. వీరి ప్రయత్నం కారణంగా రాజ్‌కోట్ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. కాగా, వీరి ప్రయత్నాన్ని ప్రముఖులు, ప్రజలు అభినందిస్తున్నారు. కాగా, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు స్వర్ణకారుల సంఘం చేస్తోన్న ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Covid Vaccination:

Also read:

Corona : దేశం వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కొవిడ్‌.. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ దే మొదటి స్థానం

Konda Vishweshwar Reddy: తెలంగాణలో మరో కొత్త పార్టీ అవసరం… చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి