Chhattisgarh Encounter: 29 మంది మావోలు హతం.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..

చత్తీస్‌గఢ్ లో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్‌ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. అగ్రనేత శంకర్రావు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న టీమ్‌కి నేతృత్వం వహించింది ఐపీఎస్ అధికారి ఇందిరా కల్యాణ్‌‌ తెలుగు వాడు కావడం విశేషం.

Chhattisgarh Encounter: 29 మంది మావోలు హతం.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..
Chhattisgarh Encounter
Follow us

|

Updated on: Apr 16, 2024 | 9:48 PM

చత్తీస్‌గఢ్ లో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్‌ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. అగ్రనేత శంకర్రావు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న టీమ్‌కి నేతృత్వం వహించింది ఐపీఎస్ అధికారి ఇందిరా కల్యాణ్‌‌ తెలుగు వాడు కావడం విశేషం.

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్ లోని కంకేర్‌ అటవీ ప్రాంతంలోని ఛోటే బైథియా గ్రామంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలతో సహా 29 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలంలో ఏకే 47తో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందే సమయానికి ఇంకా పోలీసులు , మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏఫ్రిల్ 19 వ తేదీన చత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల వేళ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారి ఇందిరా కళ్యాణ్ నేతృత్వంలో బీఎస్‌ఎఫ్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తరాసపడిన కూమావోయిస్టులకు భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన మావోయిస్టు అగ్రనేతలు శంకర్‌, మాధురి, లలితతో సహా 29మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మావోయిస్టు నేత శంకర్‌ నేతృత్వంలో మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం రావడంతో ఛోటే భైథియా పీఎస్‌ పరిధిలో కూంబింగ్‌ చేపట్టినట్టు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని కాంకర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐకె ఎలెసెలా తెలిపారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత శంకర్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

సంఘటనా స్థలంలో 7 ఏకే 47 రైఫిళ్లు , మూడు ఎల్‌ఎంజీలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. వాళ్లకు ఎలాంటి ప్రాణహానీ లేదని అధికారులు వెల్లడించారు. బీఎస్‌ఎఫ్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఛోటేబేథియా పీఎస్‌ పరిధిలోని హపటోలా అటవీ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా.. కాంకేర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇందిరా కళ్యాణ్ ఎలెసెల, ఐపీఎస్ ఆధ్వర్యంలో.. 

Ips Officer Indira Kalyan

Ips Officer Indira Kalyan

2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఇందిరా కళ్యాణ్ ఎలెసెల ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ద్వారా పోలీస్ గ్యాలెంట్రీ మెడల్‌ను అందుకున్నారు. గతంలో బీజాపూర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా ఉన్నప్పుడు ఎలిసెలా నక్సలైట్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అతని పని సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఈ గ్యాలంట్రీ మెడల్ అందించింది ప్రభుత్వం. బీజాపూర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా ఉన్నప్పుడు, IPS ఇందిరా కళ్యాణ్ ఎలిసెలా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇందిరా కళ్యాణ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. నక్సల్స్ ఏరివేతలో మన తెలుగువాడే క్రియాశీలకంగా వ్యవహారించడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు