PM Modi: ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేబినేట్ గ్రీన్‌ సిగ్నల్..

|

Aug 03, 2024 | 12:37 AM

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 936 కిమీ మేర పొడవున్న 8 ముఖ్యమైన జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి..

PM Modi: ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేబినేట్ గ్రీన్‌ సిగ్నల్..
Central Government Pm Mod
Follow us on

ప్రధాని మోదీ అధ్యక్షతన భేటి అయిన కేంద్ర కేబినేట్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 936 కిమీ మేర పొడవున్న 8 ముఖ్యమైన జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి.. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 50,655 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులో 68 కిమీ అయోధ్య బైపాస్ రోడ్, 121 కిమీ గౌహతి రింగ్ రోడ్, 516 కిమీ ఖరగ్‌పూర్-సిలిగురి ఎక్స్‌ప్రెస్ వే, 6-లేన్ ఆగ్రా గ్వాలియర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే(88 కిమీ), ఎనిమిది లేన్‌లతో కూడిన 30-కిమీ పొడవైన ఎలివేటెడ్ హైవేతో పాటు నాసిక్- ఖేడ్(పుణె) మధ్య 8 లేన్ రోడ్డు కూడా భాగం కానున్నాయి.

ప్రాజెక్టు ప్రయోజనాలు:

  • ఈ ప్రాజెక్ట్‌తో ఆగ్రా, గ్వాలియర్ మధ్య ప్రయాణ దూరం 50 శాతం తగ్గుతుంది.

  • ఖరగ్‌పూర్- మొరేగ్రామ్ కారిడార్‌తో పశ్చిమ బెంగాల్, నార్త్-ఈస్ట్ మధ్య ఆర్ధిక వ్యవస్థ మరింతగా మెరుగుపడుతుంది.

  • కాన్పూర్ రింగ్ రోడ్ ద్వారా ఆ నగరం చుట్టూ ఉన్న హైవే నెట్‌వర్క్స్ ఒకటి కానున్నాయి.

  • రైపూర్-రాంచీ కారిడార్ ద్వారా జార్ఖండ్, చత్తీస్‌ఘర్ మరింతగా అభివృద్ధి చెందనున్నాయి.

  • పోర్ట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్ధ్యం మెరుగుపరచడం కోసం.. అలాగే గుజరాత్‌లో హై స్పీడ్ రోడ్ నెట్‌వర్క్‌ను పూర్తి చేయడానికి థారాడ్, అహ్మదాబాద్ మధ్య కొత్త కారిడార్ దోహదపడుతుంది.

  • గౌహతి రింగ్ రోడ్డు ఉత్తర తూర్పు వైపునకు అడ్డంకులు లేని హై-స్పీడ్ రోడ్డు కారిడార్ సులభతరం చేస్తుంది.

  • ఇకపై ఈ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ద్వారా అయోధ్యకు చాలా వేగంగా ప్రయాణం చేయవచ్చు.

  • లాజిస్టిక్స్ ఖర్చును మరింతగా తగ్గించేందుకు పూణే, నాసిక్ మధ్య 8 లేన్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ దోహదపడుతుంది.

  • దేశంలోని నిరుద్యోగ యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 4.42 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి