Centre announces Rs 1500 assistance for transgenders : భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కష్టకాలంలో హిజ్రాల కొరకు రూ. 1500 ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందుకోసం http://www.nisd.gov.in అను వెబ్ సైట్ నందు మీ ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తదితర విషయాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా సహాయ సంచాలకులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కొవిడ్ పరిస్థితుల వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ట్రాన్స్ జెండర్లకు కేంద్రం చేయూతనివ్వాలని ఈ మేరకు నిర్ణయించింది. బిక్షాటనే తప్ప మరో వృత్తి లేనివారే ఎక్కువగా ఉంటున్నారని గుర్తించిన కేంద్రం ట్రాన్స్ జెండర్స్ కు తక్షణ జీవనాధార సహాయాన్ని అందిస్తామని ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Read also : TS LAWCET & TS PGLCET : లా సెట్, పిజి లా సెట్ దరఖాస్తు గడువు వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగింపు