MGNREGA Wage Rates: గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు

|

Mar 29, 2024 | 1:40 PM

ఇదిలా ఉంటే ఉపాధిహామీ పథకం నిర్వ హణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది.ఇప్పటికే సాప్ట్ వేర్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని పనిదినాల లక్ష్యాలు కేటాయింపులను పర్యవేక్షిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల వారీగా పెంచిన రోజువారి వేతన రేటును ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని సూచించింది...

MGNREGA Wage Rates: గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
Mgnrega
Follow us on

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి కూలి పెరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త వేతనం అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వు లు జారీ చేసింది. దీంతో రోజుకు రూ. 272 అందుతున్న కూలి రూ.300కు పెరగనుంది. ఈ నిర్ణయంతో మండలంలో 11,079 వేల మంది కూలీలకు లబ్ది చేకూరనుంది.

ఇదిలా ఉంటే ఉపాధిహామీ పథకం నిర్వ హణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది.ఇప్పటికే సాప్ట్ వేర్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని పనిదినాల లక్ష్యాలు కేటాయింపులను పర్యవేక్షిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల వారీగా పెంచిన రోజువారి వేతన రేటును ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని సూచించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా ఉపాధి కూలీలకు ప్రయోజనం దక్కనుంది.

పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, మండలం, జిల్లా లక్ష్యాలను నిర్దేశిస్తుండగా రాష్ట్ర ప్రభు త్వం మరిన్ని పనిదినాలు పెంచేది.మూడేళ్లుగా ఈ లక్ష్యాల మేరకు కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ఉపాధి హామీ పథకం కూలీని రూ. 15 మాత్రమే పెంచారు. అయితే ఈసారి ఎక్కువగా పెంచారు. పెరిగిన కొత్త వేతనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

కాగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే లక్ష్యంతో కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏడాదికి 100 రోజులు పని కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 25వ తేదీ ఆగస్టు 2005న ప్రారంభించింది. ఈ పథకాన్ని తీసుకొచ్చిన ప్రారంభంలో దినసరి వేతనం రూ. 87.50 కాగా ప్రస్తుతం రూ. 272కి పెరిగింది. తాజాగా రూ. 28 పెంచి రూ. 300 ఇవ్వనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..