India Census 2027: దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్ రిలీజ్.. ఈ 5 రాష్ట్రాలకు మినహాయింపు..

దాదాపు 16 ఏళ్ల తర్వాత దేశంలో మళ్లీ జనాభా లెక్కలు జరగనున్నాయి. అవును తాజాగా 2027 జనవరి 25 నుంచి దేశ వ్యాప్తంగా జనాభా లేక్కల నిర్వహించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చినట్టు తెలిపింది. కాబట్టి ఏఏ రాష్ట్రాల్లో జనాభా లెక్కలు నిర్వహించబోతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

India Census 2027: దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్ రిలీజ్.. ఈ 5 రాష్ట్రాలకు మినహాయింపు..
Census 2027 Schedule Announced

Updated on: Oct 31, 2026 | 11:48 AM

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరగబోతున్నాయి. దాదాపు 16 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా జనాభా లెక్కల నిర్వహణకు తాజాగా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ జన గణన నిర్వహించనున్నట్టు కేంద్ర పేర్కొంది. అయితే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, మంచు ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు మాత్రం ఈ లెక్కల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర పేర్కొంది. పరిపాలనా పరమైన ఇబ్బందులు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. జనాభా గణన ప్రక్రియను మొత్తం రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఒకటి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, మరొకటి ప్రజజే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవడం. ఈ రెండు విధాల్లో జనగణను చేయనున్నారు. అయితే సెల్ఫ్‌ ఎమ్యూనరేషన్ విధానాన్ని జనవర్ 10 నుంచే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు అధికారులు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఇక జనాభా గణనకు 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను గడువును విధించింది ప్రభుత్వం. అంటే ఆ సమయానికి ఉన్న జనాభా వివరాలను ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు నమోదు చేయనున్నారు.

జనవరి 10 నుంచి స్వీయ గణనకు అవకాశం

జనాభా గణనలో ప్రజలు సులభంగా పాల్గొనేందుకు ప్రభుత్వం స్వీయ గణన సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2027 జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. తద్వారా ఇంటింటికీ వెళ్లి అధికారులు వివరాలు సేకరించే ప్రక్రియకు ముందుగానే తమ సమాచారాన్ని అందించే వీలుంటుంది.

మినహాయింపు ఇచ్చిర రాష్ట్రాలు ఇవే?

అయితే 2027లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మణిపూర్, గోవా , ఉత్తరప్రదేశ్ , పంజాబ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు జనాభా లెక్కల నుంచి మినహాయింపు ప్రకటించారు. అలాగే మంచు ప్రభావం ఎక్కువగా ఉండే లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాలకు కూడా ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పరిపాలనా పరమైన సవాళ్లు, శీతాకాలంలో మంచు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ రాష్ట్రాలు, ప్రాంతాల్లో జనాభా లెక్కలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us