తమిళనాడులో ఎలుగుబంటి అటవీప్రాంతాన్ని విడిచి జనావాసంలోకి వచ్చింది. ఆవేశంతో రెచ్చిపోయింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో ముగ్గురినీ గాయపరిచింది. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెన్‌కాశిలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. వైకుంఠమణి అనే వ్యక్తి మసాలా దినుసులు తీసుకుని తన బైక్ మీద వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఉన్న అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. బైక్ మీద నుంచి పడిపోయిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. అతనిపై కూర్చున్న ఎలుగుబంటి అతడి తలను కొరుకుతూ, గోళ్లలో రక్కుతూ దాడి చేసింది. ఇదంతా కెమెరాలో చిక్కుకుంది.
దాడి చేస్తోన్న ఎలుగుబంటి
तमिलनाडु के तेनकासी में भालू ने तीन लोगों पर घातक हमला किया है. इसमें दो गंभीर रूप से घायल बताएं जा रहे हैं.#TamilNadu #Tenkasi #bearattack #Viralvideo pic.twitter.com/Et0oRemBN7
— Narendra Singh (@NarendraNeer007) November 7, 2022
ఇది గమనించిన స్థానికులు ఎలుగుబంటిపై రాళ్లు విసరడంతో వాళ్లు మీదకు దూసుకెళ్లి వారిని సైతం గాయపరిచింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. అటుగా వస్తున్న మరికొంత మంది ఎలుగుబండిని బెదరించడంతో ఎలుగు.. అక్కడి నుంచి పారిపోయింది. ఎలుగుబంటి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్షతగాత్రుడిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
అయితే కడయం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు అప్పుడప్పుడు పెంపుడు జంతువులపై దాడి చేస్తాయి.. కానీ తొలిసారిగా మనుషులపై దాడులకు పాల్పడ్డాయని స్థానికులు చెప్పారు. వన్యప్రాణులు నివాస ప్రాంతాలలోకి చొరబడకుండా సోలార్ కంచె, తవ్విన కందకాన్ని నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. కడయం అటవీ రేంజ్ కార్యాలయం ముందు రహదారిని దిగ్బంధించారు. ఈ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో సారి ఎలుగుబంటి దాడి అని నివేదికలు పేర్కొన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..