నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ.. నీళ్ల పంచాయతీ తెగేదెలా?

కావేరీ నది పారేది కర్ణాటక, తమిళనాడు నుంచే ఐనా, పరీవాహక ప్రాంతం మాత్రం కేరళ, పాండిచ్చేరిలో కూడా విస్తరించి ఉంది. అంటే మొత్తం 4 రాష్ట్రాల మధ్య పంచాయతీ పెడుతున్నట్టు. 5 రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి నదిదైతే ఇంకా పెద్ద పంచాయతీ. ఉపనదులు, డెల్టా ప్రాంతం కలిపి 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నీళ్ల పంపకాలు షురూ చేయాలి. 14 వందల కిలోమీటర్ల పొడవున బిరబిరా పరుగులిడే క్రిష్ణవేణమ్మ రెండు తెలుగురాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్నాటక మధ్య పితలాటకం పెడుతోంది. జీవనదుల పుణ్యమా అని నాన్‌స్టాప్‌గా జరుగుతోంది అంతర్రాష్ట్ర నీళ్ల తగాదా. పైగా, ఎల్‌నినోతో వర్షాభావమొచ్చి ఎగువ నీటికి డిమాండ్ పెరిగి ప్రతీ నీటి చుక్కనూ లెక్కబెట్టి వాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే, అరడజను మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిగతా డ్యూటీల కంటే సాగు, తాగునీటి అవసరాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో వాటర్ లాబీయింగ్‌తోనే సరిపోతోంది వీళ్లందరికీ.

నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ.. నీళ్ల పంచాయతీ తెగేదెలా?
South India Water Disputes

Updated on: Nov 18, 2026 | 10:01 PM

ఎప్పుడూ కొట్లాటలేనా, నీటి పంపకాల వ్యవహారంలో ఏళ్ల తరబడి ఎందుకీ వివాదాలు.. మీలో మీరు కూర్చుని మాట్లాడుకోలేరా.. అని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నెత్తిన గత నెల్లోనే గట్టిగా మొట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతామన్న కర్నాటక వాదనకు ఉలిక్కిపడిన దిగువ రాష్ట్రాలు, ఇన్‌ఫ్లో తగ్గుతుంది మొర్రో అని కోర్టు మెట్లెక్కినప్పుడు ఈ విధంగా అక్షింతలు పడ్డాయి. ఇలా చివాట్లు తినడం ఇదే ఫస్టూ కాదు, ఇదే లాస్టూ కాదు. కోర్టులే కాదు, ఆ కోర్టులు ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లు, మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం.. ఎన్నిసార్లు సిట్టింగులు వేసినా తెగని పంచాయతీ ఇది. వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టుకున్నా, ప్రయోజనం శూన్యం. వాటిలోకి నీళ్లు రాక ఎగువ రాష్ట్రాలతో జరిగే బేరసారాలతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. చెప్పుకోడానికి, చూసుకోడానికి జీవనదులు ఎన్నున్నా, పొద్దస్తమానూ జల జగడాలతోనే సరిపోతోంది దక్షిణాది రాష్ట్రాలకు. నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య గిల్లికజ్జాలు ఎన్నంటే ఏం చెప్పగలం..? నదులు పరిమితం, నదిలో నీళ్లు పరిమితం. పెరుగుతున్న అవసరాలు మాత్రం అపరిమితం. వర్షపాతంలో పెనుమార్పులొచ్చి, సాగు తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగి, ఎవరికివాళ్లు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి దిగుతుంటే, ఎగువ, దిగువ రాష్ట్రాల మధ్య జల...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి