ఏకే-47తో కాల్చుకుని బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య

ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కంకెర్‌ జిల్లాలోని సంగం క్యాంపులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ 157 బెటాలియన్‌కు చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏకే-47తో కాల్చుకుని బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య

Edited By:

Updated on: Jun 06, 2020 | 4:00 PM

ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కంకెర్‌ జిల్లాలోని సంగం క్యాంపులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ 157 బెటాలియన్‌కు చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న సర్వీస్‌ రివాల్వర్‌ (ఏకే47)తో కాల్చుకున్నాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన జవాన్‌ సురేష్‌ కుమార్ అని.. ఇతడు హర్యానాలోని సోనిపట్‌కు చెందిన వాడని అధికారులు తెలిపారు. ఇతడి వయస్సు 49 ఏళ్లు. సంగం క్యాంప్‌కు దాదాపు 200 మీటర్ల దూరంలో తన దగ్గర ఉన్న ఏకే 47 రైఫిల్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. శుక్రవారం రాత్రి 157 బెటాలియన్‌తో కలిసి ఘోడ గ్రామంలోని డోకోమెటా ప్రాంతంలో గాలింపు చర్యలకు వెళ్లాడని.. తెల్లవారు జామున క్యాంప్‌కు తిరిగి వచ్చే సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.