చూస్తుండగానే కొట్టుకుపోయిన వంతెన…ఆ దృశ్యాలు మీరే చూడండి..

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి అనేక చోట్ల నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల బీభత్సంతో  జనజీవనం అస్థవ్యస్థంగా మారింది.

చూస్తుండగానే కొట్టుకుపోయిన వంతెన...ఆ దృశ్యాలు మీరే చూడండి..

Updated on: Aug 26, 2020 | 4:36 PM

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి అనేక చోట్ల నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల బీభత్సంతో  జనజీవనం అస్థవ్యస్థంగా మారింది.. అనేక చోట్ల రోడ్లు తెగిపోయిన రవాణా సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవటంతో ప్రజలు ఎక్కడివారు అక్కడే స్తంభించిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూలో కురిసిన భారీ వర్షాలకు  ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది.

ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి జమ్మూలోని జీవన్ నగర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుంగిపోయింది. పక్కకు వంగిపోయిన వంతెన అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయింది.  బ్రిడ్జ్ కొట్టుకుపోతున్న దృశ్యాలను అక్కడి స్థానికులు కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us