Chandigarh University: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ప్రకటన చేసిన అధికారులు..

|

Sep 19, 2022 | 7:27 AM

Chandigarh University: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసు ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరి వీడియోలు లీక్ కాలేదని యూనివర్సిటీ వివరణ ఇచ్చింది.

Chandigarh University: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ప్రకటన చేసిన అధికారులు..
Chandigarh University
Follow us on

Chandigarh University: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసు ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరి వీడియోలు లీక్ కాలేదని యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్‌తో అమ్మాయిల నగ్న వీడియోలు షేర్ చేసుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి ఫోన్‌లో ఎవరి వీడియోలు లేవన్నారు యూనివర్సిటీ ప్రొ- ఛాన్సలర్ ఆర్ఎస్ బావా. కేవలం ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు మాత్రమే ఉన్నాయన్నారు. వీడియోలను లీక్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది విద్యార్ధినుల న్యూడ్ వీడియోలు లీకయ్యాయంటూ పెద్ద వివాదమే నడుస్తోంది. యూనివర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్ధులు భారీ ఆందోళన చేపట్టారు. విద్యార్ధినిల స్నానాల దృశ్యాలను వైరల్‌ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ క్యాంపస్‌లో బైఠాయించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు విద్యార్ధులు. పరిస్థితి అదుపు తప్పడంతో రెండు రోజుల పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ విద్యార్ధినిల వీడియోలు ఒక్కటి కూడా వైరల్‌ కాలేదని అధికారులు, పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని అంటున్నారు.

విద్యార్థినుల వీడియోల వైరల్‌ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు మొహలీ ఎస్పీ వివేక్‌ సోని. అయితే యూనివర్సిటీలో ఎవరు ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. నిందితురాలి ఫోన్ ల్యాబ్‌కు పంపించి టెస్టులు చేస్తున్నారు. ఘటనపై ఎవిడెన్స్‌ కలెక్ట్‌ చేస్తున్నామని.. సమగ్ర దర్యాప్తు చేసి వివరాలను చెబుతామన్నారు. రూమర్లను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పంజాబ్‌ ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..