Baba Ramdev: అలోపతి విధానాన్ని, డాక్టర్లను విమర్శిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి తీవ్ర ఆగ్రహానికి గురైన యోగా గురు బాబా రాందేవ్ ఈ పరిణామాలకు ఏ మాత్రం చలించలేదు. తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదని సవాల్ చేశారు. ఇలా చేసే సాహసం ఎవరికైనా ఉందా అని అన్నారు. .. దేశద్రోహం ఆరోపణలపై ఆయనను అరెస్టు చేయాలనీ, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రద్జాని మోదీకి లేఖ రాసిన విషయం గమనార్హం. అయితే మోదీ ప్రభుత్వం తనను అరెస్టు చేయజాలదని బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను కాంగ్రెస్ నేత గౌరవ్ పాంధీ రిలీజ్ చేశారు. ‘ఉన్ కా బాప్ భీ అరెస్ట్ నహీ కర్ సక్ తా’..(ఆయన తండ్రి కూడా అరెస్ట్ చేయలేడు) రామ్ దేవ్ బాబాను ఎవరూ అదుపులోకి తీసుకోలేరు..వాళ్ళు ఏదేదో వాగుతుంటారు.. వాళ్ళేం చేస్తారో చేయనివ్వండి’ అని ఆయన చిద్విలాసంగా వ్యాఖ్యానించారు. ఈయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ శాఖ కూడా తీవ్రంగా విమర్శిస్తూ తన వ్యాఖ్యలకు ఆయన 15 రోజుల్లోగా అపాలజీ చెప్పాలని, లేని పక్షంలో వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆయనకు నోటీసు పంపింది.
కానీ వీటికి బాబా రామ్ దేవ్ స్పందించలేదు సరికదా.. నన్ను అరెస్ట్ చేసే సాహసమే ఎవరికీ లేదంటున్నారు. అటు రాందేవ్ ఐఎంఏ కి 25 ప్రశ్నలను కూడా సంధించారు. అందులోకూడా అలోపతి చికిత్సా విధానంపై తీవ్ర విమర్శలు చేశారు.
Ramdev challenges Modi Govt into arresting him, says “UNKA BAAP BHI ARREST NAHI KAR SAKTA”
Over to you, @narendramodi @AmitShah !!
— Gaurav Pandhi (@GauravPandhi) May 25, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Karthika Deepam: దమ్ము కొడుతూ కనపడిన వంటలక్క.. నెట్టింట వైరల్.. ( వీడియో )
SIRISH6: రొమాంటిక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ బ్రదర్.. శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్