Ashwini Vaishnaw: ‘బీజేపీ హయాంలోనే గిరిజనుల సాధికారత’.. కాంగ్రెస్‌ను ఎండగట్టిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

|

Jun 11, 2024 | 9:56 PM

ఒక గిరిజన నేతకు ముఖ్యమంత్రి అధికారం పీఠం ఇవ్వడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని, ఒడిశా సీఎం పగ్గాలు ఆదివాసి నేత అయిన మోహన్‌ చరణ్‌ మాఝీకి అప్పగించడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు అశ్విని వైష్ణవ్.

Ashwini Vaishnaw: బీజేపీ హయాంలోనే గిరిజనుల సాధికారత.. కాంగ్రెస్‌ను ఎండగట్టిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw
Follow us on

ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రముఖ ఆదివాసీ నేత మోహన్‌ చరణ్‌ మాఝీని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. భువనేశ్వర్‌లో మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష భేటీలో మాఝీని సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక గిరిజన నేతకు ముఖ్యమంత్రి అధికారం పీఠం ఇవ్వడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని, ఒడిశా సీఎం పగ్గాలు ఆదివాసి నేత అయిన మోహన్‌ చరణ్‌ మాఝీకి అప్పగించడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు అశ్విని వైష్ణవ్. ‘ ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే, 21వ శతాబ్దంలో కాంగ్రెస్ ఏ గిరిజన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించలేదు. కానీ బీజేపీ అధిష్ఠానం నలుగురు గిరిజనులను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, విష్ణు దేవ్ సాయి, ఇప్పుడు మోహన్ మాఝీ ముఖ్యమంత్రులు అయ్యారు.
ఇక అస్సాంలో కూడా బీజేపీ సర్బానంద సోనోవాల్‌ను సీఎం చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఏ గిరిజనుడిని ముఖ్యమంత్రి చేయలేదు’

‘ఇక రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్మును నామినేట్ చేశాం. అలాగే మరో అభ్యర్థి పీఏ సంగ్మాకు కూడా బహిరంగంగా మద్దతు ఇచ్చాం. కానీ ఈ ఇద్దరినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది. గిరిజనుల సాధికారత గురించి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరన్నదానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనాలు’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు అశ్విని వైష్ణవ్. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్‌ స్థానం నుంచి మోహన్‌ చరణ్‌ మాంఝీ ఎన్నికయ్యారు. ధర్మేంద్ర ప్రదాన్‌ , జుయెల్ ఓరం లాంటి నేతలను పక్కనపెట్టి 52 ఏళ్ల మాఝీని హైకమాండ్‌ వ్యూహాత్మకంగా సీఎం పదవికి ఎంపిక చేసింది. ఆదివాసీ ప్రాంతాల్లో మాఝీకి గట్టి పట్టుంది. 2000, 2009,209,2024 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి

అశ్విని వైష్ణవ్ ట్వీట్ ఇదిగో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…