Delhi Liquor Scam: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌.. పూర్తి వివరాలు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌తో పాటు..

Delhi Liquor Scam: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌.. పూర్తి వివరాలు
Arvind Kejriwal
Follow us

|

Updated on: Aug 12, 2024 | 4:22 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ను ఈనెల 27 లోగా విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ కేసులో బెయిల్‌ లభించినప్పటికి సీబీఐ కేసులో జైల్లో ఉన్నారు కేజ్రీవాల్‌. మరోవైపు సీబీఐ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్‌. లిక్కర్‌ పాలసీ స్కాంలో సీబీఐ ఐ కేసులో ఆగస్టు 5న కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో ఆయన మరోసారి బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో తనకు కూడా బెయిల్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి