జిమ్‌లో జాజిమల్లీ.. అదరగొట్టిన శివాత్మిక 

Rajeev 

12 AUG 2024

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శివాత్మిక రాజశేఖర్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది శివాత్మిక. దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆతర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ చిన్నది.  శివాత్మిక రాజశేఖర్ ఇటీవల వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది.

కథలకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అందాల భామ. తన నటనతో మెప్పిస్తోంది.

పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

చివరిగా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే సినిమాలో నటించింది శివాత్మిక. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా జిమ్ లోని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జిమ్ చేసి అలసిపోయి మిర్రర్ ఫోటోలు తీసుకుంది ఈ ముద్దుగుమ్మ