కేంద్రం, పంజాబ్ సర్కారు మధ్య ముదురుతున్న వివాదం.. గడ్కరీ స్ట్రాంగ్ వార్నింగ్

మెరుగైన రహదారి సదుపాయం ఆ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి మూలం. ఒక్క రహదారితో యావత్ ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది. అందుకే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు.. ముఖ్యంగా రహదారి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది.

కేంద్రం, పంజాబ్ సర్కారు మధ్య ముదురుతున్న వివాదం.. గడ్కరీ స్ట్రాంగ్ వార్నింగ్
Nitin Gadkari
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 12, 2024 | 4:52 PM

మెరుగైన రహదారి సదుపాయం ఆ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి మూలం. ఒక్క రహదారితో యావత్ ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది. అందుకే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు.. ముఖ్యంగా రహదారి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. ప్రతియేటా మూలధన వ్యయాన్నిపెంచుకుంటూ పోతూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అయితే జాతీయ రహదారులకు పూర్తిగా నిధులు సమకూర్చేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ.. అందుకు అవసరమైన భూమిని సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపై ఉంటుంది. తమ రాష్ట్రానికి హైవే, ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు కావాలంటూ ప్రతి రాష్ట్రం కేంద్రానికి అర్జీ పెట్టుకుంటున్న ఈ రోజుల్లో, ప్రాజెక్టు మంజూరు కావడమే ఆలస్యం భూసేకరణ చేపట్టి అప్పగించేందుకు అన్ని రాష్ట్రాలు ఉత్సాహంగా ఉన్నాయి.

అయితే అందరిదీ ఒక దారి, నాది మరో దారి అన్నట్టుగా వ్యవహరిస్తోంది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా ఆ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 41 జాతీయ రహదారి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా సమీక్ష నిర్వహించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. పంజాబ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూసేకరణ చేపట్టి అప్పగించకపోగా.. రైతులు, భూ యజమానుల నుంచి ప్రాజెక్టు నిర్మాణ సంస్థలపై జరుగుతున్న దాడులను సైతం రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేక చేతులెత్తేస్తోంది. ఫలితంగా అనేక ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయి. రాష్ట్రం మొత్తమ్మీద 1,500 కి.మీ పొడవున మంజూరైన 41 హైవే ప్రాజెక్టులకు కేంద్రం రూ. 52,000 కోట్లు ఖర్చు చేస్తోంది. వాటిలో 7 చిన్న ప్రాజెక్టులు 80-90% మేర పూర్తవగా, మిగతా 34 మేజర్ ప్రాజెక్టుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. భూసేకరణ జరపకపోవడమే ఇందుకు కారణమని తేలింది.

రైతులు – హింసాత్మక ఆందోళనలు..

వ్యవసాయ భూములను రహదారులు లేదా ఇతర జాతీయ ప్రాజెక్టుల కోసం వదులుకోవడం ఎవరికైనా బాధాకరమే. భూమితో ఎంతో అనుబంధం పెనవేసుకొన్న రైతులైతే తమ భూమిని విడిచిపెట్టేందుకు ససేమిరా అంటారు. ఇది దేశంలో ఎక్కడైనా ఉన్న పరిస్థితే. అయితే దేశాభివృద్ధి కోసం ప్రాజెక్టులు కూడా అవసరమే. ఇది గ్రహించిన రైతులు చివరకు అంగీకరిస్తూ ఉంటారు. అయితే తాము కోల్పోయిన భూమికి సమానంగా మరో చోట భూమి లేదా, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తుంటారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి వేరు. పంజాబ్ రాష్ట్రంలో వేరు. ఇక్కడ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు, నిర్మాణ సంస్థ సిబ్బందిపై హింసాత్మక దాడులకు సైతం తెగబడుతున్నారు. రైతులతో చర్చలు జరిపి, నచ్చజెప్పి ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. పైపెచ్చు శాంతిభద్రతలను కూడా కాపాడడంలో విఫలమవుతోంది. ఇదే ఆ రాష్ట్రంలో ప్రాజెక్టుల పురోగతిని నిలువరిస్తోంది.

ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ వే..

పంజాబ్ రాష్ట్రంలో మంజూరైన, నిర్మాణంలో ఉన్న మిగతా అన్ని ప్రాజెక్టుల కంటే ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే భారతదేశానికే ఒక ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టు. జమ్ము-కాశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయం, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం చేరుకోవడానికి ఈ హైవే ఎంతో కీలకంగా మారుతుంది. ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. రాష్ట్రంలో మంజూరైన జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ఇప్పటికే మూడింటిని NHAI రద్దు చేసింది. వాటి విలువ రూ. 3,263 కోట్లు. భూసేకరణలో తలెత్తుతున్న సమస్యల కారణంగానే ప్రాజెక్టులను రద్దు చేసినట్టు NHAI తెలిపింది. రాష్ట్రంలో అంతర్భాగంగా న్న ఈ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ నష్టం పంజాబ్ రాష్ట్రానికే తలెత్తుతుంది. అయితే వీటి సంగతెలా ఉన్నా.. ఢిల్లీ – అమృత్‌సర్ – కాట్రా ఎక్స్‌ప్రెస్ వే మాత్రం రద్దు చేయడానికి వీల్లేనిది.

ఎందుకంటే ఇది ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగించి జమ్ము కాశ్మీర్‌లో కాట్రా (వైష్ణోదేవి) వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులు అనేక ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచి కాంట్రాక్టులు అప్పగించారు. మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించగా.. అందులో 11 ప్యాకేజీలు ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్యాకేజి పూర్తికాకపోయినా.. మధ్యలో ఆగిపోయినా.. మొత్తం ప్రాజెక్టు నిరర్థకంగా మారుతుంది. అందుకే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించే కీలకమైన ఎక్స్‌ప్రెస్ వే విషయంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నితిన్ గడ్కరీకి ఆగ్రహం తెప్పిస్తోంది. అడ్డంకులు తొలగించి సహకరించకపోతే రాష్ట్రానికి మంజూరు చేసిన 8 మేజర్ హైవే ప్రాజెక్టులను రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు లేఖ రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహిళా అధికార చేతి వాటం.. కోట్ల విలువైన 'చికెన్ వింగ్స్' గోవిందా..
మహిళా అధికార చేతి వాటం.. కోట్ల విలువైన 'చికెన్ వింగ్స్' గోవిందా..
దేశంలో ఉత్తమ విద్యాసంస్థ ఏంటో తెలుసా.? జాబితా ప్రకటించిన NIRF
దేశంలో ఉత్తమ విద్యాసంస్థ ఏంటో తెలుసా.? జాబితా ప్రకటించిన NIRF
నిహారిక సినిమా కలెక్షన్ల జాతర..3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
నిహారిక సినిమా కలెక్షన్ల జాతర..3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రక్తబంధం లేకున్నా.. ఊరి బంధానికి విలువ ఇచ్చిన గ్రామస్థులు..
రక్తబంధం లేకున్నా.. ఊరి బంధానికి విలువ ఇచ్చిన గ్రామస్థులు..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
ట్రక్ హారన్ సౌండ్‌‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన బుడ్డోళ్లు..
ట్రక్ హారన్ సౌండ్‌‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన బుడ్డోళ్లు..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే..
రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే..
38 ఏళ్ల తర్వాత వన్డేల్లో చెత్త రికార్డ్‌లో చేరిన భారత బ్యాటర్లు
38 ఏళ్ల తర్వాత వన్డేల్లో చెత్త రికార్డ్‌లో చేరిన భారత బ్యాటర్లు
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..
ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. కూటమి అభ్యర్థిపై.!
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. కూటమి అభ్యర్థిపై.!
డొనేట్ చేసిన ఫుడ్ తిన్న బాయ్స్ హాస్టల్ పిల్లలు.. తర్వాత..
డొనేట్ చేసిన ఫుడ్ తిన్న బాయ్స్ హాస్టల్ పిల్లలు.. తర్వాత..
బ్రెజిల్‌ విమాన ప్రమాదం నుంచి ఇతను ఎలా తప్పించుకున్నదంటే ??
బ్రెజిల్‌ విమాన ప్రమాదం నుంచి ఇతను ఎలా తప్పించుకున్నదంటే ??
ఫైవ్ స్టార్‌ హోటల్‌లో బాలుడి రూ.1.50 కోట్లు చోరీ..
ఫైవ్ స్టార్‌ హోటల్‌లో బాలుడి రూ.1.50 కోట్లు చోరీ..
నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??
నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??
ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు
ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు