Border Drone: బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..! అర్నియా సెక్టార్‌లో డ్రోన్లు.. పుల్వామా జిల్లా కేంద్రంలో కాల్పులు..

|

Jul 14, 2021 | 9:50 AM

Pulwama Encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..మనదేశంలోకి చొచ్కుకొచ్చేందుకు.. భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు.

Border Drone: బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..! అర్నియా సెక్టార్‌లో డ్రోన్లు.. పుల్వామా జిల్లా కేంద్రంలో కాల్పులు..
Drone Guard System
Follow us on

జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..మనదేశంలోకి చొచ్కుకొచ్చేందుకు.. భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం.. వారం రోజులుగా డ్రోన్‌ దాడులకు విఫలయత్నం చేస్తున్నాయి  టెర్రర్ మూకలు.. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఓ డ్రోన్‌ కలకలం సృష్టించింది. అర్నియా సెక్టార్‌లో డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. ఈ తెల్లవారుజామున పాక్‌ నుంచి భారత్‌వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అలర్టైన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

జమ్ముకశ్మీర్‌లో మరోమారు డ్రోన్ల కలకలం చెలరేగింది. బుధవారం తెల్లవారుజామున 5.25 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. గుర్తించిన BSF సైనికులు దానిపై కాల్పులు జరిపారు. వెంటనే అది అటు నుంచి వెనక్కి మళ్లిందని BSF అధికారులు వెల్లడించారు. డ్రోన్‌ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గత కొద్ది రోజులుగా జమ్ములోని చాలాప్రాంతాల్లో డ్రాన్లు  నాలుగు రోజులు గడవకముందే అంటే.. ఆదివారం రాత్రి 11.45 గంటలకు సమయంలో సరిగ్గా ఇదే ప్రాంతంలో కనిపించిన డ్రోన్లు.. తిరిగి ఇక్కడే కనిపించడంతో మరింత భద్రతను పెంచారు.  వీటి కదలికలను గుర్తించిన సైన్యం 25 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అవి అక్కడ నుంచి కనిపించకుండా పోయాయి.

ఇదిలావుంటే జమ్ము కశ్మీరులోని పుల్వామా జిల్లా కేంద్రంలో కాల్పుల మోత మొగుతోంది. బుధవారం  తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ మొదలైంది. ఈ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా  అధికారులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ACB: వికారాబాద్‌ జిల్లాలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఎస్సై

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు ప్రశంసలు దోచుకోవడంలో నెంబర్ వన్!