Viral: చెరువు తవ్వుతుండగా 10 అడుగుల లోపల బయటపడిన అరుదైన అద్భుతం.. అందరూ షాక్

మిజోరాంలో అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ చెరువు తవ్వుతుండగా పురాతన విగ్రహం బయటపడింది. దానిపై పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు.

Viral: చెరువు తవ్వుతుండగా 10 అడుగుల లోపల బయటపడిన అరుదైన అద్భుతం.. అందరూ షాక్
Representative image
Follow us

|

Updated on: Jul 25, 2022 | 4:26 PM

Mizoram: మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లాలోని డార్లాన్ గ్రామం(Darlawn village) సమీపంతో అరుదైన ఘటన వెలగుచూసింది. గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో చెరువు తవ్వేందుకు స్థానికులు పూనుకున్నారు. అందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రాంతంలో 10 అడుగులు లోతు తవ్విన తర్వాత ఓ అరుదైన విగ్రహం బయటపడింది. దాన్ని చూడగానే స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విగ్రహం దేవతకు సంబంధించినదిగా తెలుస్తోంది.. ఏ దేవత అనేది మాత్రం అర్థం కావడం లేదు. విగ్రహంలో వీరత్వం ఉట్టిపడుతుంది. ఈ పురాతన విగ్రహం ఎవరిది అనేది అధికారికంగా గుర్తించలేదు. అయితే మిజోరాం గూర్ఖా మందిర్ కమిటీ. స్థానిక హిందువులు ఇది హిందూ దేవత కాళీ దేవికి చెందినదిగా చెబుతున్నారు. కొంతమంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఈ విగ్రహం హిందూ మత దేవతకు చెందినవని భావిస్తున్నారు. ఈ విగ్రహం 3.6 అడుగుల పొడవు, 1.9 అడుగుల వెడల్పు ఉంది. దాదాపు రెండు క్వింటాళ్ల బరువు ఉంటుంది. ఇతర విగ్రహాలు ఏమైనా కనుగొనే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తవ్వకాల స్పీడు పెంచారు. విగ్రహం దొరికిన భూమి డార్లాన్ విలేజ్‌కు చెందిన లాల్‌రేమ్‌రుటా అనే వ్యక్తికి చెందినదిగా చెబుతున్నారు. క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రజలు అధికంగా ఉండే మిజోరాం రాష్ట్రంలో  హిందూ దేవతను పోలిన పురాతన విగ్రహం బయటపడటం స్థానికంగా చర్చనీయంశమైంది. (Source)

Ancient Statue

Ancient Statue

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..