సంగీతాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. అంతగా జీవితంలో భాగమైన మ్యూజిక్ పట్ల కొందరు అభిరుచి, ఆసక్తి ఏర్పరుచుకుంటారు. పాటలు పాడడం, సంగీత పరికరాలను వాయించడం అభిరుచిలో భాగమే. మనం అనుకున్న విషయాన్ని నెరవేర్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. తమకు ఇష్టమైన రంగాల్లో రాణించాలని కోరుకున్నా పరిస్థితులు అనుకూలించగా ఇతర రంగాలకు వెళ్లిపోతుంటారు. అయినా వారి మనసులో ఏర్పడిన అభిరుచి పట్ల ఉన్న ప్రేమ అలాగే ఉంటుంది. అది అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ రిటైర్డ్ నేవీ ఆఫీసర్ స్జేజ్ పై పాటను అద్భుతంగా పాడుతూ కనిపించారు. ఆయన పాట పాడటాన్ని చూస్తుంటే ప్రొఫెషనల్ సింగర్ లా అనిపించక మానదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరూ ఆ రిటైర్డ్ ఆఫీసర్ స్వరానికి ఫిదా అయిపోతారు.
బాలీవుడ్ మూవీ ‘పాపా కెహతే హై’ లోని ‘ఘర్ సే నికల్తే హై’ పాటను నేవీ రిటైర్డ్ అధికారి చాలా అద్భుతంగా పాడటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఈ పాటను పాడారు. అయితే ఈ నావికాదళ అధికారి కూడా ఈ పాటను ఉదిత్ మాదిరిగా చాలా అందంగా పాడారు. అంతే కాకుండా ఆయన స్వరం, ఉదిత్ స్వరం ఒకటేనేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. స్టేజ్ పై అద్భుతంగా పాట పాడిన ఈ రిటైర్డ్ నేవీ అధికారి పేరు గిరీష్ లూథ్రా. నేవీ వెస్ట్రన్ కమాండ్ కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా విధులు నిర్వహించిన ఆయన 2019లో పదవీ విరమణ చేశాడు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నౌకాదళంలో సేవలందించిన ఆయన.. తన అభిరుచిని నెరవేర్చుకునే అవకాశాన్ని ఏర్పరచుకున్నారు. నౌకాదళ స్వర్ణోత్సవ కార్యక్రమంలో నిర్వహించిన సంగీత కచేరీలో అడ్మిరల్ లూత్రా తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు.
पूरे दिल से सुनिएगा इसको ❤️ pic.twitter.com/RtAGJbqio7
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 13, 2022
ఈ వీడియో 2019 సంవత్సరానికి చెందినదైనప్పటికీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వీడియోకు ఎన్నో లైక్స్, వ్యూస్ వస్తున్నాయి. రిటైర్డ్ నేవీ ఆఫీసర్ పాట విన్న నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..