Mumbai: రెచ్చిపోయిన ఆకతాయిలు.. కొరియన్ మహిళకూ తప్పని వేధింపులు.. చేయి పట్టుకుని మరీ..

|

Dec 01, 2022 | 1:52 PM

మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కొందరు రెచ్చిపోతున్నారు. వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అంత కంటే ఎక్కువగా దాడులు...

Mumbai: రెచ్చిపోయిన ఆకతాయిలు.. కొరియన్ మహిళకూ తప్పని వేధింపులు.. చేయి పట్టుకుని మరీ..
Korean Woman
Follow us on

మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కొందరు రెచ్చిపోతున్నారు. వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అంత కంటే ఎక్కువగా దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశం పర్యాటక ప్రాంతాలను నెలవు. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి సంప్రదాయాలను వీక్షించేందుకు చాలా మంది టూరిస్టులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో వారికి కూడా సేఫ్టీ లేకుండా పోతోంది. ముంబయి లో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కెమెరా సాక్షిగా మహిళా యూ ట్యూబర్‌పై వేధింపులకు పాల్పడ్డారు. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇస్తుండగా ఆ యూట్యూబర్‌ను ఓ యువకుడు చేయిపట్టి లాక్కెళ్లాడు. ఈ దారుణ ఘటన ముంబై సబర్బ్‌లోని ఖర్‌ ప్రాంతంలో జరిగింది.

ఓ కొరియన్‌ మహిళా యూట్యూబర్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఉన్న సమయంలో కొందరు యువకులు అక్కడికి వచ్చారు. ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఊహించని పరిణామానికి హతాశురాలైన ఆమె ‘నో.. నో’ అంటూ అరవడం కనిపించింది. ఆమె ఎంతగా విడిపించుకోవాలని ప్రయత్నించినా ఆ యువకుడు చేయి వదల్లేదు. ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెబుతూ బైక్ వద్దకు తీసుకెళ్తుండగా.. అందుకు ఆమె నిరాకరిస్తూ తన ఇల్లు అక్కడకు దగ్గరేనని, తాను వెళ్లగలనంటూ సమాధామనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోను బాధిత యువతి రీ ట్వీట్‌ చేసింది. ఆ యువకుడితోపాటు మరో వ్యక్తి ఉండడంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించానని చెప్పింది.

ఇవి కూడా చదవండి

నవంబరు 30 రాత్రి తాను లైవ్ స్టీమ్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు వివరించింది. తాను మరీ స్నేహపూర్వకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెప్పారని, దీంతో స్ట్రీమింగ్ గురించి ఆలోచించాల్సి వస్తోందని వాపోయింది. కాగా, వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తమంత తామే కేసు నమోదు చేసి ఆమెను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం