9ఏళ్లకే ఐపీఎస్ అయిన చిన్నారి.. సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసు లోనే నిండు నూరేళ్ళు నిండి పోతున్నాయి. తాజగా వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారి కి IPS అధికారి కావాలనే కల ఉంది. అయితే విధి వక్రీకరించింది. దీంతో ఆ చిన్నారి బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడింది. తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్న నానుడి ఇక్కడ బాగా అన్వయం అవుతుంది.

9ఏళ్లకే ఐపీఎస్ అయిన చిన్నారి.. సోషల్ మీడియాలో వైరల్..
Varanasi
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 27, 2024 | 7:59 PM

అతి పిన్న వయసులోనే ఐపీఎస్ అయిన చిన్నారి. పోలీసుల చేత గౌరవ వందనం తీసుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో సంచలనంగా మారింది. ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసు లోనే నిండు నూరేళ్ళు నిండి పోతున్నాయి. తాజగా వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారి కి IPS అధికారి కావాలనే కల ఉంది. అయితే విధి వక్రీకరించింది. దీంతో ఆ చిన్నారి బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడింది. తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్న నానుడి ఇక్కడ బాగా అన్వయం అవుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌‎లోని మహా మన క్యాన్సర్‌ ఆస్పత్రిలో బ్రెయిన్‌ ట్యూమర్‌కు చికిత్స పొందుతోంది ఈ చిన్నారి. IPS అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది బాల్యంలోనే తీరింది.

ADG జోన్ వారణాసి అధికారిక ఎక్స్ ఖాతాలో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్నిషేర్ చేసింది. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలో చికిత్స పొందుతున్న పరిస్థితిలో IPS అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం పరిచింది. ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారులకు తెలిసి వెంటనే స్పందించారు. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నేరవేరడంతో ఆమెకు సంబందించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారాయి. భారతి ఖాకీ దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. ఇతర పోలీసు సిబ్బందిని కలిసింది. అంతే కాదు, పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది. ఆ చిన్నారికి పోలీసులు గౌరవ వందనం కూడా సమర్పించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంచి పని చేశారు అంటూ పోలీసు అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో