బర్త్ డే కేక్ ని ‘కసాయి కత్తి’ తో కోశారు….బుక్ అయ్యారు….చెన్నైలో ఆరుగురు యువకుల అరెస్ట్

ఎవరైనా తమ బర్త్ డే సందర్బంగా కేక్ ని చిన్న, సున్నితమైన చాకుతో కోసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ చెన్నైలో మాత్రం ఆరుగురు యువకులు ఇలా చప్పగా చేస్తే మజా ఏముంటుందని అనుకున్నారో ఏమో గానీ..తమ స్నేహితుడి పుట్టినరోజును..

  • Publish Date - 4:06 pm, Wed, 9 June 21 Edited By: Anil kumar poka
బర్త్ డే కేక్ ని 'కసాయి కత్తి' తో  కోశారు....బుక్ అయ్యారు....చెన్నైలో ఆరుగురు యువకుల అరెస్ట్
6 Youths Booked For Cutting Birthday Cake With Machet

ఎవరైనా తమ బర్త్ డే సందర్బంగా కేక్ ని చిన్న, సున్నితమైన చాకుతో కోసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ చెన్నైలో మాత్రం ఆరుగురు యువకులు ఇలా చప్పగా చేస్తే మజా ఏముంటుందని అనుకున్నారో ఏమో గానీ..తమ స్నేహితుడి పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కోసేందుకు ఓ పెద్ద కసాయి కత్తినే తెచ్చారు. పైగా మ్యూజిక్ కూడా పెద్ద సౌండ్ తో పెట్టి గానా బజానాతో హంగామా చేశారు. ఈ నెల 6 న నగరంలోని కణ్ణగి నగర్ లో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలు చివరకు నీరుగారిపోయాయి. వీరి గోలతో విసుగెత్తిపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సునీల్ అనే యువకుడితో బాటు నవీన్, కుమార్, అప్పు, దినేష్, రాజేష్, కార్తీక్ అనే యువకులను అరెస్టు చేశారు. ప్రమాదకరమైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ఏర్పాటు చేసినందుకు వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసు పెట్టారు.

గతంలో కూడా కొందరు యువకులు తమ ఫ్రెండ్ పుట్టినరోజున కేక్ ను పెద్ద కత్తితో కట్ చేసినందుకు బుక్ అయ్యారు. వారిపై పోలీసులు కేసు పెట్టడంతో వారి పేరెంట్స్ ఇందుకు అభ్యంతరం తెలిపారు. మరి..ఇప్పుడు ఈ ఘటన ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సిందే పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాల సందర్బంలో సినీ పాటలతో మైక్ ల ద్వారా విపరీతమైన సౌండ్ పెట్టి కొందరు ఎంజాయ్ చేస్తున్నారని, కానీ అవి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.

ఆనందయ్య ఆవేదన..!ఆనందయ్య మందు పంపిణీలో గందరగోళం..అయన శిష్యులు ఎంత మంది ? :Anandaiah Corona Medicine video.

బధిరుల వార్తలు : భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..థర్డ్ వెవ్ పిల్లలపై మరింత ప్రభావితం..:cases decrees in India.

డబుల్ కిక్కుతో మాస్ కా దాస్..ఫలక్ నుమా దాస్ మూవీ కి సీక్కుల్ ను ప్రకటించిన విశ్వక్ సేన్ : Falaknuma Das sequel.