Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ వైద్య కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. వెంటిలేటర్ పైనున్న చిన్నారులకు ఆక్సిజన్ అందకపోవడంతో నలుగురు శిశువులు మృతి చెందారు. ఈ పిల్లలందరినీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లోని ఎస్‌ఎన్‌సియు వార్డులో చికిత్స అందిస్తుండగా.. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీలో నిన్న రాత్రి SNCU వార్డులో 4 గంటలపాటు కరెంటు కోత కారణంగా, వెంటిలేటర్‌కు ఆక్సిజన్ అందలేదు. దీంతో నలుగురు శిశువులు చికిత్స పొందుతూ శ్వాస అందక మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్‌కు ఆక్సిజన్సరఫరా నిలిచిపోయిందని, అయినా వైద్య కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు మృతుల బంధువుల ఆరోపణలను మెడికల్ కాలేజీ యాజమాన్యం తోసిపుచ్చింది. కరెంటు కోత వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదని మెడికల్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అంబికాపూర్ జిల్లా కలెక్టర్ కూడా ఆసుపత్రికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్‌దేవ్ ఆందోళన వ్యక్తంచేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంబికాపూర్ మెడికల్ కాలేజీలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని దీంతో.. నిన్న రాత్రి నలుగురు నవజాత శిశువులు మృతి చెందినట్లు సమాచారం అందిందని ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్‌దేవో తెలిపారు. విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించానని తెలిపారు. మరింత సమాచారం కోసం తానే స్వయంగా అంబికాపూర్ ఆసుపత్రికి వెళ్తున్నానన్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Chhattisgarh | 4 infants died at Ambikapur Medical College allegedly due to a power cut for 4 hrs in SNCU ward last night
I’ve instructed Health Secy to form probe team. Going to Ambikapur Hospital to gather more info. Further action will be ensured after probe: State Health Min pic.twitter.com/J0lWxsnfEC
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 5, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..