కట్టుదిట్టమైన భద్రతలో కశ్మీర్

| Edited By:

Aug 02, 2019 | 5:11 AM

కశ్మీర్ లోయ సీఆర్పీఎఫ్ జవాన్లతో నిండిపోయింది. 280 కంపెనీల భద్రతా బలగాలు గురువారం సాయంత్రం నుంచి మోహరించాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. కేంద్రం దాదాపు 28 వేలమంది జవాన్లను అకస్మాత్తుగా కశ్మీర్‌లోయకు తరలించింది. శ్రీనగర్‌ను పారామిలిటరీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జవాన్లతో పాటు స్థానిక పోలీసులు సైతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. భద్రతా దళాల మోహరింపుతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా తమకు కావాల్సిన […]

కట్టుదిట్టమైన భద్రతలో కశ్మీర్
Follow us on

కశ్మీర్ లోయ సీఆర్పీఎఫ్ జవాన్లతో నిండిపోయింది. 280 కంపెనీల భద్రతా బలగాలు గురువారం సాయంత్రం నుంచి మోహరించాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. కేంద్రం దాదాపు 28 వేలమంది జవాన్లను అకస్మాత్తుగా కశ్మీర్‌లోయకు తరలించింది. శ్రీనగర్‌ను పారామిలిటరీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జవాన్లతో పాటు స్థానిక పోలీసులు సైతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. భద్రతా దళాల మోహరింపుతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను సిద్ధం చేసుకుంటున్నారు.