వారితో ఎప్పుడు రాజీనామా చేయిస్తున్నారు జగన్ గారు…

ఏపీ శాసన మండలి రద్దు అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. శాసన మండలి రద్దును ఆమోదించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవాస్తవాలే ఊపిరిగా జగన్ జీవిస్తున్నారన్నారు. శాసన మండలిలో ఇప్పటి వరకూ 38 బిల్లులు ఆమోదం పొందాయని.. రెండు బిల్లులకు సవరణలు […]

వారితో ఎప్పుడు రాజీనామా చేయిస్తున్నారు జగన్ గారు...
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 9:19 AM

ఏపీ శాసన మండలి రద్దు అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. శాసన మండలి రద్దును ఆమోదించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవాస్తవాలే ఊపిరిగా జగన్ జీవిస్తున్నారన్నారు. శాసన మండలిలో ఇప్పటి వరకూ 38 బిల్లులు ఆమోదం పొందాయని.. రెండు బిల్లులకు సవరణలు అడిగామని.. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని తెలిపారు. అసలు చేసిన అభివృద్ధే శూన్యమైన్నప్పుడు.. మండలిలో అభివృద్ధిని అడ్డుకున్నారు అనడంలో అర్ధమే లేదన్నారు.

పేద రాష్ట్రంలో మండలి భారంగా మారిందని, శాసనసభలో తీర్మానం చేస్తే మండలి రద్దు అయినట్టే అని సీఎం అంటున్నారని.. మరి నైతిక బాధ్యతగా ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్సీలు, మీ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలతో ఎప్పుడు రాజీనామా చేయిస్తున్నారంటూ జగన్‌ను ప్రశ్నించారు.