మెగా బ్రదర్ కొత్త టార్గెట్.. ఈసారి గెలుపే లక్ష్యంగా

Nagababu, మెగా బ్రదర్ కొత్త టార్గెట్.. ఈసారి గెలుపే లక్ష్యంగా

పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి. ఇదీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట. ‘‘ఈసారి పోతే పోయింది. 2024 ఉందిగా’’ అంటున్నారట. అయితే సిల్వర్ స్క్రీన్ పై రికార్డుల మోత మోగించిన మెగా ఫ్యామిలీ.. రాజకీయాల్లో చేసిన రికార్డులు మాత్రం అభిమానులను కలచివేస్తున్నాయట. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద సంచలనానికి మెగా బ్రదర్స్ చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. పవన్, నాగబాబు ఇద్దరూ సొంత సెగ్మెంట్ లోనే ఓడిపోవడం.. ఇంకా అభిమానులను కోలుకోకుండా చేస్తోందట. ‘‘2009, 2019 కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త టైటిల్ తో సినిమా తీద్దాం అంటున్నాడట’’ పవన్. అదే టార్గెట్ 2024. ఇందుకు తమ్ముడి కంటే ముందుగానే అన్నయ్య నాగబాబు కూడా రెడీ అయ్యారు.

పడిపోయిన చోటే నిలబడాలనే నాగబాబు డిసైడ్ అయ్యారట. అంతే నర్సాపురంలో వాలిపోయారు. ఈసారి పోతే పోయింది వచ్చే ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామని క్యాడర్ తో అంటున్నారట. అంతేకాదు పర్యటనలు, పరామర్శలతో జనసైన్యంలో మళ్లీ జోష్ నింపుతున్నారట.ఊరికే తిరిగితే లాభం లేదనుకున్న నాగబాబు…ఇక ఇప్పటినుంచే అధికార పార్టీపై విమర్శలు స్టార్ట్ చేశారు. నర్సాపురం పర్యటన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫ్యాన్ పార్టీ సర్కార్ ఫైరయ్యారు నాగబాబు. తమ నేతలను వేధిస్తున్నారంటూ ఆరోపించిన నాగబాబు..తాను పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉన్నాననే సంకేతాలు ఇచ్చేశారు. ఇక మెగా బ్రదర్స్ టార్గెట్ 2024 ఎలా ముందుకెళ్తుందో చూద్దాం అని అనుకుంటున్నారట ఏపీ పొలిటికల్ లీడర్స్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *