Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

రాక్‌స్టార్ బర్త్‌డే.. శుభాకాంక్షల వెల్లువ

Devi Sri Prasad Birthday, రాక్‌స్టార్ బర్త్‌డే.. శుభాకాంక్షల వెల్లువ

డీఎస్పీ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ.. ఈ పేరుకు ఓ ఎనర్జీ ఉంది, ఓ బ్రాండ్ ఉంది. ఈ పేరు మూవీ పోస్టర్‌ మీద కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అని చాలామంది నమ్ముతారు. చిన్న, పెద్ద, ముసలి వయసు బేధం లేకుండా అందరినీ తన బీట్‌తో స్టెప్పులు వేయించగల ఎనర్జీ ఆయనది. అంతేకాదు ఇంటర్నేషనల్‌గా డీఎస్పీ కంపోజ్ చేసిన పాటలు పలు డ్యాన్స్‌ షోలలో మారుమోగాయి. అంతేకాదు తాను పనిచేసిన ప్రతి హీరోకు గుర్తుండిపోయే ఆల్బమ్‌ను ఇచ్చిన డీఎస్పీ.. వారికి ఎప్పుడూ ఫేవరెట్‌గా ఉంటాడు. ఇక కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఎత్తుపళ్లాలను ఎదుర్కొన్నప్పటికీ.. గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ దర్శకుడిగా కొనసాగుతున్న ఈ సంగీత తరంగం తాజాగా 40వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచే కాకుండా అభిమానుల నుంచి ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హరీష్ శంకర్, జగపతి బాబు, అల్లరి నరేష్, అనిల్ సుంకర, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి తదితరులు దేవీ శ్రీకి శుభాకాంక్షలను తెలిపారు.

కాగా ఈ ఏడాది ‘ఎఫ్‌ 2’, ‘చిత్రలహరి’, ‘మహర్షి’ మూడు చిత్రాలతో హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ప్రస్తుతం.. ‘చిరు 152’ చిత్రానికి, మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’కు, అల్లు అర్జున్ 20వ చిత్రానికి, కీర్తి సురేష్, ఆది పినిశెట్టి మూవీకి.. పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ‘ఉప్పెన’కు సంగీతం అందిస్తున్నాడు.