ముంబైని వీడని భారీ వర్షాలు, 37 మంది మృతి

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. ఈ వర్షాల కారణంగా వేర్వేరు దుర్ఘటనల్లో ఏకంగా 37 మంది మృతి చెందగా, 80 మంది గాయాలపాలయ్యారు. ముంబైలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు, విమాన సేవలను ముంబై గవర్నమెంట్ రద్దు చేసింది. ఈ సందర్భంగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేవీ, అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా.. […]

ముంబైని వీడని భారీ వర్షాలు, 37 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 10:17 AM

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. ఈ వర్షాల కారణంగా వేర్వేరు దుర్ఘటనల్లో ఏకంగా 37 మంది మృతి చెందగా, 80 మంది గాయాలపాలయ్యారు. ముంబైలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు, విమాన సేవలను ముంబై గవర్నమెంట్ రద్దు చేసింది.

ఈ సందర్భంగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేవీ, అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా.. వచ్చే 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాగా.. ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకొని, ఈశాన్య జార్ఖండ్‌ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కేంద్రీకృతమైంది. రానున్న నాలుగు రోజుల్లో ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.