బిడ్డ కోసం పాముతో యుద్ధం చేసిన ఎలుక

అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్పగలం. అది చేసింది.. ఇది చేసింది అని చెప్పడానికి వీలులేని ప్రపంచం అమ్మ. ఎందుకంటే అమ్మ తన పిల్లల కోసం చేసే త్యాగాలు, వారిపై చూపించే ప్రేమకు వెల‌క‌ట్ట‌లేం. అమ్మ‌ను మించిన దైవమున్నదా అని సినీ కవులు కూడా ఒకే ఒక్క మాటలో అమ్మ గొప్పతనం గురించి చెప్పేశారు. అమ్మ ప్రేమ‌ను చెప్ప‌డానికి ఈ వీడియో ఒక్కటి సరిపోతుందేమో.. అమ్మతో ఆడుకుంటున్న చిట్టెలుకను ఓ పాము చూసింది. అంతే తల్లి కొద్దిగా […]

బిడ్డ కోసం పాముతో యుద్ధం చేసిన ఎలుక
Follow us

|

Updated on: May 30, 2020 | 5:31 PM

అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్పగలం. అది చేసింది.. ఇది చేసింది అని చెప్పడానికి వీలులేని ప్రపంచం అమ్మ. ఎందుకంటే అమ్మ తన పిల్లల కోసం చేసే త్యాగాలు, వారిపై చూపించే ప్రేమకు వెల‌క‌ట్ట‌లేం. అమ్మ‌ను మించిన దైవమున్నదా అని సినీ కవులు కూడా ఒకే ఒక్క మాటలో అమ్మ గొప్పతనం గురించి చెప్పేశారు. అమ్మ ప్రేమ‌ను చెప్ప‌డానికి ఈ వీడియో ఒక్కటి సరిపోతుందేమో..

అమ్మతో ఆడుకుంటున్న చిట్టెలుకను ఓ పాము చూసింది. అంతే తల్లి కొద్దిగా పక్కకు తిరిగిందో లేదో అంతే… చిన్నారి ఎలుకను నోటితో పట్టేసింది. దాన్ని మింగేందుకు ప్రయత్నింస్తున్న సమయంలో తల్లి ఎలుక చూసింది. అంతే.. ఒక్కసారిగా పాముపై యుద్ధానికి దిగింది. వీరోచితంగా పోరాడింది. దాని వెంట పడింది…పామును ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు తల్లి ఎలుకతో పోరాడలేక చిట్టి ఎలుకను వదలిలేసింది. అయినా తన దాడిని మాత్రం కన్నప్రేమ ఆపలేదు. పారిపోతున్న పామును వెంటాడింది. మరింత దూరం తరిమేసింది. ప్రాణాలతో బయటపడ్డ బిడ్డను చూసి తల్లి ఎలుక ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ సుశాంత నందా తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. తన బిడ్డ కోసం ఏ తల్లి అయినా.. ఏమైనా చేయగలదు అంటూ.. ఓ ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశారు. సుశాంత నందా పోస్ట్ చేసిన తెగ వైరల్‌గా మారుతోంది.