Breaking News
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • నెల్లూరు: మర్రిపాడు మండలం అల్లంపాడులో ముగ్గురు అరెస్ట్‌. గుప్తనిధులు తవ్వకాలు చేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్‌. పరారీలో మరో ఇద్దరు, కారు స్వాధీనం.
  • ప్రధాని అధ్యక్షతన 2016లో జరిగిన సమావేశంలో.. అన్నిరాష్ట్రాల్లో టెలీహెల్త్‌ సర్వీస్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ అధికారులతో సమావేశం నిర్వహించాం. తెలంగాణలో అమలులో ఉన్నందున అదే విధానాన్ని అమలు చేయమని చెప్పా. తెలంగాణ ఈఎస్‌ఐ అధికారులు టెలీ హెల్త్ సర్వీస్‌తో.. ఎంవోయూ చేసుకోమనడంతో నేను లెటర్‌ రాశా. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా టెండర్ల పద్ధతి ద్వారా.. మందులు కొనుగోలు చేయాలని మంత్రిగా ఆదేశించా-అచ్చెన్నాయుడు.
  • కార్మికుల సొమ్ముదోచుకున్న అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఈఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికి తీయాలి-వైసీపీటీయూసీ నేత గౌతమ్‌రెడ్డి. ఇందులో ఎవరెవరు భాగస్వాములో కూడా వెల్లడించాలి. అచ్చెన్నాయుడును అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి-గౌతమ్‌రెడ్డి.

రెండు రోజులు భారత్‌లో జిన్‌పింగ్.. కీలక నిర్ణయాలు..?

Modi and Xi Jinping meet at Mahabalipuram, రెండు రోజులు భారత్‌లో జిన్‌పింగ్.. కీలక నిర్ణయాలు..?

శుక్రవారం భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రానున్నారు. ఈరోజు మధ్యాహ్నాం 2 గంటలకు ఆయన చెన్నైకి చేరుకోనున్న జిన్‌పింగ్. ఆయనకు స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ. రెండ్రోజుల శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడు తీరప్రాంతం మహాబలిపురం వేదిక కానుంది. ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన అగ్రనాయుకులంతా హాజరుకానున్నారు. గతేడాది ఎప్రిల్‌లో భారత ప్రధాని మోదీ చైనాలో పర్యటించి.. ఇరుదేశాల స్నేహసంబంధాలపై చర్చించారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజంలో భారత్‌కు పూర్తిగా మద్దతు లభిస్తున్న సమయంలో.. జిన్‌పింగ్‌ పర్యటన మరింత కీలకం కానుంది. ఈ పర్యటనలో కాశ్మీర్‌పై జిన్‌పింగ్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. కాశ్మీర్‌ అంశం ఇక మాటల్లేవు అని ప్రధాని మోదీ ఇప్పటికే తేల్చిచెప్పారు.

మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ కోసం మహాబలిపురం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రెండు దేశాల జెండాలు.. ధగధగ మెరిసే కాంతులతో వెలిగిపోతోంది. మరోవైపు.. పోలీసులు.. పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోంకుడా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. లాగే.. ఇరు దేశాల ప్రధానిల భద్రత కోసం.. ముందుగా కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రెండు రోజులు చైనా ప్రధాని జిన్‌పింగ్ భారత్‌లో ఉండనున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల ప్రధానిలు ఎలాంటి కీలక నిర్ణయాలకు తెరదించనున్నారో.. అనే ఆసక్తి రేకెత్తిస్తోంది.

Related Tags