‘మగధీర’ మంచి జ్ఞాపకం.. శ్రీహరిని గుర్తు చేసుకున్న చెర్రీ..
'మగధీర' సినిమా మంచి జ్ఞాపకం అని గుర్తు చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలాగే మగధీర షూటింగ్ సమయంలో శ్రీహరితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు రామ్ చరణ్. ''మగధీర చిత్రం విడుదలై ఇప్పటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. మగధీరలో శ్రీహరి 'షేర్‌ఖాన్' పాత్ర చేశారు. తనను సెట్స్ లో ఓ కొడుకులా చూసుకున్నారని..
‘మగధీర’ సినిమా మంచి జ్ఞాపకం అని గుర్తు చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలాగే మగధీర షూటింగ్ సమయంలో శ్రీహరితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు రామ్ చరణ్. ”మగధీర చిత్రం విడుదలై ఇప్పటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. మగధీరలో శ్రీహరి ‘షేర్‌ఖాన్’ పాత్ర చేశారు. తనను సెట్స్ లో ఓ కొడుకులా చూసుకున్నారని తెలిపాడు చరణ్. ముఖ్యంగా ఫైట్స్ సీన్స్‌లో ఆయన ఉంటే ఎంతో జాగ్రత్త వహించేవారు. బెడ్స్ చెక్ చేసి, ఫైటర్స్‌కి జాగ్రత్తలు చెప్పేవారు. అలాగే చిన్నప్పటి నుంచీ ఆయన మా కుటుంబంలో ఒక వ్యక్తిలా కలిసి మెలిసి ఉండేవారు. ఆయన్ని మిస్ చేసుకున్నందుకు చాలా బాధగా ఉందని” ఆవేదన వ్యక్తం చేశాడు చరణ్.
అలాగే ట్విట్టర్లో ట్వీట్ చేశాడు చెర్రీ. ”చిత్ర యూనిట్, ప్రేక్షకులు చూపించిన ఆదరణ గొప్పదన్నాడు. హద్దులు చెరిపేసి ముందుకు సాగాలని తనకు రాజమౌళి సూచించారని పేర్కొన్నాడు చరణ్. తనలో స్ఫూర్తి నింపిన జక్కన్నకు ఈ సందర్భంగా చెర్రీ థాంక్స్ చెప్పాడు. కష్టే ఫలి అనే మాట నిజమైందని” ట్వీట్లో పేర్కొన్నాడు చెర్రీ.
A memorable experience that mentored me & put every skill of mine to test. I’m humbled by the love & affection shown by the entire team of #Magadheera & the audience. @ssrajamouli garu, you motivate me to push my limits & remind me that hard work always pays off. pic.twitter.com/1NQh0eEG8G
— Ram Charan (@AlwaysRamCharan) July 31, 2020
Read More:
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కి షాక్.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..
తన తాతను తలుచుకుని ఎమోషనల్ అయిన బన్నీ.. ట్వీట్ చేస్తూ..