కోర్టు ఆదేశాలతో తెరుచుకున్న మధుర ఆలయం

లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారిగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని బాంకే బిహారీ ఆలయంలో తెరుచుకుంది.

కోర్టు ఆదేశాలతో తెరుచుకున్న మధుర ఆలయం
Follow us

|

Updated on: Oct 17, 2020 | 4:13 PM

లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారిగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని బాంకే బిహారీ ఆలయంలో తెరుచుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఏడు నెలల పాటు మూసే ఉన్న ప్రఖ్యాత ఆలయం కోర్టు అనుమతితో తెరిచారు. అంతకు ముందు ఆలయ పరిపాలన విభాగం అధికారులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఇక అనువైన పరిస్థితుల నేపథ్యంలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30గంటల వరకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే, కరోనా సంక్రమణ క్రమంలో కఠిన నిబంధనలను పాటించాలని ఆలయ సిబ్బందికి పోలీసులు సూచించారు. ప్రసాదం, పువ్వులు ఆలయంలోకి అనుమతి ఇవ్వడం లేదని మధుర పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఉదయ్‌ శంకర్‌ చెప్పారు.

ఆలయ పరిసరాల్లో భౌతిక దూరం, శానిటైజేషన్‌, మాస్క్‌లు ధరించడం తప్పనిసరని ఆలయ పరిపాలన విభాగం పేర్కొంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా, సామాజిక దూరం పాటించేలా వలంటీర్లను నియమించనున్నట్లు తెలిపింది. అలాగే భక్తులను నియంత్రించేందుకు అదనంగా పోలీస్‌ బలగాలు అవసరం ఉంటుందని, భక్తులందరు కొవిడ్‌ నియమాలను పాటిస్తారనే నమ్మకం ఉందని టెంపుల్‌ అడ్మినిస్ట్రేటర్‌ మునిష్‌ పేర్కొన్నారు.

అయితే, కరోనా విజృంభణ సమయంలో వైరస్ కట్టడిలో భాగంగా జూన్ 8 నుండి మధుర బృందావన్ లోని ‘బాంకే బిహారీ’ ఆలయం మూతపడింది. భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. కాగా, ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఆలయ దర్శనాన్ని కల్పించడంలేదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. జోక్యం చేసుకున్న మున్సిఫ్ కోర్టు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మధుర ఆలయాన్ని వెంటనే తెరవాలని ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మురళీ మోహనుడి దర్శన భాగ్యం భక్తులకు కలిగింది.