Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Masks and kisses: కొత్తగా పెళ్ళైన జంటలు.. మాస్కులతోనే ముద్దులు..!

చైనాలో 2వేలకు పైగా ప్రజలను బలిగొన్న కరోనా వైరస్‌ మరో 26 దేశాల్లో విజృంభిస్తోన్న సంగతి విదితమే. ఫిలిప్పైన్స్‌లో వాలంటైన్స్‌ డే అనంతరం సామూహిక వివాహాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా బాకోలోడ్‌
Masks and kisses, Masks and kisses: కొత్తగా పెళ్ళైన జంటలు.. మాస్కులతోనే ముద్దులు..!

Masks and kisses: చైనాలో 2వేలకు పైగా ప్రజలను బలిగొన్న కరోనా వైరస్‌ మరో 26 దేశాల్లో విజృంభిస్తోన్న సంగతి విదితమే. ఫిలిప్పైన్స్‌లో వాలంటైన్స్‌ డే అనంతరం సామూహిక వివాహాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా బాకోలోడ్‌ పట్టణంలో సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టింది స్థానిక ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 220జంటలు ఒక్కటయ్యాయి. నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆ వేడుక జరిగే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లని వస్త్రాలు ధరించిన నూతన వధూవరులతో ఆ ప్రదేశం శ్వేతమయం అయ్యింది.

కాగా.. వారి ముఖాలకు నీలి రంగు మాస్కులు ఉండడంతో అక్కడ కొత్త వాతావరణం ఏర్పడింది. ఇలా ధరించిన మాస్కులతోనే వివాహం చేసుకున్న నూతన దంపతులు, వారి మొదటి చుంబనంతో భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయడం అందర్నీ ఆకర్షించింది. వివాహ జీవితాన్ని ఇలా జాగ్రత్త పాటిస్తూ ఆరంభించడం సంతోషంగా ఉందన్నారు. మాస్కుతో ముద్దు పెట్టుకోవడం వింత అనుభూతినిచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కొందరు నూతన దంపతులు.

కరోనా విజృంభణ నేపథ్యంలో.. వివిధ దేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారిని నిశితంగా పరిశీలించి 14 రోజుల గడువు అనంతరం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిచ్చామన్నారు నిర్వాహకులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిలో పాల్గొనే ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్కులు అందించిన అధికారులు తమ పట్టణం ఆరోగ్యంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ పట్టణంలో 2013 సంవత్సరంలో దాదాపు 2013 జంటలు ఒక్కటై రికార్డు సృష్టించాయి.

Related Tags