ఎగ్జిట్ పోల్స్ వెనుక భారీ కుట్ర – దీదీ

ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. సర్వేల ఆధారంగా అన్ని సంస్థలు దాదాపు 300 సీట్లు గెలిచుకుని బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దీదీ ఫైరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ గాసిప్ ను తాను నమ్మనని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వదంతుల్ని బాగా వ్యాపించి.. ఆ సమయంలో వేలాది ఈవీఎంలను తరలించేందుకు కుట్ర చేస్తున్నారని దీదీ ఆరోపించారు. అందుకే […]

ఎగ్జిట్ పోల్స్ వెనుక భారీ కుట్ర - దీదీ
Follow us

|

Updated on: May 20, 2019 | 6:44 AM

ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. సర్వేల ఆధారంగా అన్ని సంస్థలు దాదాపు 300 సీట్లు గెలిచుకుని బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దీదీ ఫైరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ గాసిప్ ను తాను నమ్మనని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వదంతుల్ని బాగా వ్యాపించి.. ఆ సమయంలో వేలాది ఈవీఎంలను తరలించేందుకు కుట్ర చేస్తున్నారని దీదీ ఆరోపించారు. అందుకే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచి మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మమతా బెనర్జీ హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం దీదీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.