రష్యాలో భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 6.6 గా నమోదు

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 6.6 గా నమోదైంది. నార్త్ వెస్ట్ లోని నికోల్స్‌కోయికి 152కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. కంచట్కా ప్రాంతానికి 33 కిలో మీటర్లు దూరంలో ఈ భూకంపం రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఫసిఫిక్ మహా సముద్రానికి దగ్గరగా ఉండటంతో.. సునామీ వచ్చేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే యూఎస్జీఎస్ సంస్థ మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని […]

రష్యాలో భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 6.6 గా నమోదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2019 | 5:07 PM

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 6.6 గా నమోదైంది. నార్త్ వెస్ట్ లోని నికోల్స్‌కోయికి 152కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. కంచట్కా ప్రాంతానికి 33 కిలో మీటర్లు దూరంలో ఈ భూకంపం రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఫసిఫిక్ మహా సముద్రానికి దగ్గరగా ఉండటంతో.. సునామీ వచ్చేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే యూఎస్జీఎస్ సంస్థ మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ భూకంపతో ఎటువంటి నష్టం వాటిల్లిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Latest Articles