Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య

lovers commit suicide Khammam district, మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి నిరాకరిస్తారేమోననే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యానికి పాల్పడింది. జూలూరుపాడు మండలం ,అన్నారుపాడు గ్రామానికి చెందిన గూగులోత్ గోపీచంద్ (22) అదే గ్రామానికి చెందిన లావుడియా సింధు (21) ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు  కాదంటారేమో అనే భయంతో ఇద్దరూ కలిసి చచ్చిపోవాలనుకున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నుండి బయల్దేరిని గోపీచంద్‌, సింధు గ్రామంలోని పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగారు..అనంతరం తమ ఆత్మహత్య విషయాన్ని ఇరు కుటుంబాల వారికి ఫోన్ చేసి చెప్పారు.  దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరూ విగత జీవులుగా పడివున్నారు. మృతిచెంది ఉన్నారు. మృతదేహాలను గ్రామానికి తరలించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గ్రామంలోని పలువురి విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.