Women’s Health: పీరియడ్ పెయిన్‌ని తగ్గించే 5 ఆహారాలు.. తిన్నారంటే నొప్పి నుంచి ఉపశమనం ఖాయం..!

Women's Health: మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ పెయిన్‌తో ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయమే. కానీ కొన్ని రకాల ఆహారాపు అలవాట్లు, జీవనశైలి మార్పుల కారణంగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే వికారం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్, బాడీ పెయిన్స్ వంటి ఇతర ఇబ్బందులను కూడా నిరోధించవచ్చు. అందుకోసం నిత్యం తీసుకునే ఆహారంలో ఓ 5 పదార్థాలను కలిపి తీసుకుంటే..

Womens Health: పీరియడ్ పెయిన్‌ని తగ్గించే 5 ఆహారాలు.. తిన్నారంటే నొప్పి నుంచి ఉపశమనం ఖాయం..!
Women's Health

Updated on: Oct 03, 2023 | 12:38 PM

Women’s Health: మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ పెయిన్‌తో ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయమే. కానీ కొన్ని రకాల ఆహారాపు అలవాట్లు, జీవనశైలి మార్పుల కారణంగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే వికారం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్, బాడీ పెయిన్స్ వంటి ఇతర ఇబ్బందులను కూడా నిరోధించవచ్చు. అందుకోసం నిత్యం తీసుకునే ఆహారంలో ఓ 5 పదార్థాలను కలిపి తీసుకుంటే సరిపోతుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ సూచిస్తున్నారు. ఆమె తెలియజేసిన ప్రకారం పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం కోసం ఏయే పదార్థాలను తీసుకోవాలంటే..

ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు: నల్లని ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు కలయిక పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం మీరు రాత్రి పూట నానబెట్టిన ఎండుద్రాక్ష, కుంకుమ పువ్వును పీరియడ్స్ రోజుల్లో ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లోని పోషకాలు మీకు నొప్పి నుంచి విముక్తి కలిగిస్తాయి.

నెయ్యి: పీరియడ్స్ సమయంలో నెయ్యి తీసుకోవడం కూడా నొప్పి నివారణకు ఉత్తమ పద్ధతి. ఇందుకోసం మీ ఆహారంలో నెయ్యి కలిపి తినండి. ఫలితంగా నొప్పితో పాటు తిమ్మిర్లు, వికారం కూడా తగ్గుతాయి.

పెరుగు: బహిష్టు సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారికి పెరుగు మంచి భోజన ఎంపిక. శరీరంపై సానుకూల ప్రభావాలే తప్ప దుష్ప్రభావాలను కలిగించిన పెరుగుతో శరీరానికి శక్తి కూడా లభిస్తుంది.

విత్తనాలు: జీడిపప్పు, బాదం, వేరు శనగలు, గుమ్మడి గింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ నొప్పి, మూడ్ స్వింగ్స్, కండరాల నొప్పులు తగ్గుతాయి.

మిల్లెట్స్: మిల్లెట్స్ కూడా పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మిల్లెట్స్‌తో చేసిన దోశ, రోటీ వంటివాటిని తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పితో పాటు కడుపు నొప్పి కూడా దూరం అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us