
ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని ENT విభాగం హెడ్ డాక్టర్ రవి మెహ్రా దీని గురించి మాట్లాడుతూ.. చెవిలో పేరుకుపోయే మురికిని ఇయర్‌వాక్స్ అంటారు. సాధారణంగా జనం దీనిని మురికిగా భావిస్తారు. కానీ ఇది చెవిలోని సహజ రక్షణ పొర. దుమ్ము, హానికరమైన బ్యాక్టీరియా చెవిలోకి రాకుండా ఇది నిరోధిస్తుంది. కానీ ఈ మురికి అధికంగా పేరుకుపోతే అది ఆరోగ్య సమస్యలను కలిగించేదిగా మారుతుంది. కాబట్టి అలాంటి సమయాల్లో ENT వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
ఆరోగ్య నిపుణులు సాధారణంగా చెవులను ఇయర్‌బడ్‌లు లేదా ఇతర కర్రలు లేదా క్లిప్‌లతో శుభ్రం చేయకూడదని చెబుతుంటారు. వీటితో చెవులను శుభ్రం చేసుకోవడం మంచిది కాదని, దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవి నిజంగా చెవులను శుభ్రం చేయవు. అలాగే, అటువంటి సాధనాల వల్ల చెవికి గాయమైతే అది చెవిపోటుకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ గాయాలు ఇతర ఇన్ఫెక్షన్లు లేదా చీముకు దారితీస్తుంది. కాబట్టి, చెవిని జాగ్రత్తగా శుభ్రం చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. చెవికి సంబంధించిన ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
చెవిలో కొంత మురికి ఉన్నా, వ్యాక్స్ దానంతట అదే బయటకు వస్తుందని డాక్టర్ రవి అంటున్నారు. వేలు లేదా ఇయర్ బర్డ్స్ ఉపయోగించడం వల్ల అది మరింత లోపలికి నెట్టబడుతుంది. దీంతో తీవ్రమైన చెవి నొప్పి, చెవి నుంచి స్రావం, అకస్మాత్తుగా వినికిడి లోపం, తీవ్రమైన తలనొప్పి వంటివి సంభవిస్తాయి. చెవిలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.